‘చైనా పీస్’ నుంచి దుమ్మురేపుతున్న పవర్‌ఫుల్ ‘భగ భగ’ సాంగ్ రిలీజ్

- Advertisement -

‘చైనా పీస్’ నుంచి దుమ్మురేపుతున్న పవర్‌ఫుల్ ‘భగ భగ’ సాంగ్ రిలీజ్

The powerful ‘Bhaga Bhaga’ song from ‘China Peace’ is released.

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్‌, యాక్షన్‌, థ్రిల్ ,హ్యుమర్ ఎలిమెంట్స్ తో టీజర్ సినిమా పై అంచనాలు పెంచింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి భగ భగ సాంగ్ రిలీజ్ చేశారు. కంపోజర్ కార్తిక్ దేశభక్తి రగిలించేలా ఈ పాటని స్వపరిచారు.
కాల భైరవ పవర్ ఫుల్ వోకల్స్ సాంగ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. తన పదాలని ఆయుధాలుగా మార్చి రెహమాన్ రాసిన లిరిక్స్ అందరినీ హత్తుకున్నాయి. ఈ చిత్రానికి సురేష్ రగుతు కెమరామ్యాన్. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్. ఫిబ్రవరి చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, తులసి, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular