Wednesday, January 21, 2026

లక్ష రూపాయిలను తాకిన 10 గ్రాముల బంగారం ధర

- Advertisement -

లక్ష రూపాయిలను తాకిన 10 గ్రాముల బంగారం ధర
హైదరాబాద్ ఏప్రిల్ 21

The price of 10 grams of gold touched one lakh rupees.

బంగారం కొనుగోలు సామాన్యులకు మరింత కష్టతరం అవుతోంది. రోజురోజుకి బంగారం ధరలు అకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బంగారం ధరకి మరోసారి రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయిలను తాకింది. సోమవారం ఒక్కరోజే బంగారం రూ.2,350 పెరిగింది. దేశంలో పసిడి ధర ఈ స్థాయిని తాకడం ఇదే తొలిసారి. అమెరికా-చైనా సుంకాల యుద్ధం వల్ల బంగారం ధరలు పెరిగిపోయాయి. దీంతో డాలర్ బలహీనపడి.. మదుపర్లు బంగారంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం సోమవారం 3,405 డాలర్లకు చేరింది. దీన్ని అనుసరించి సోమవారం సాయంత్రం 5.30 గంటలకు 24 క్యారెట్ల బంగారం రూ.1,00,016కు చేరింది. ఈ ఏడాదిలో బంగారం దాదాపు రూ.20వేలకు పైగా పెరగడం గమనార్హం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్