క్రికెటర్స్ ను అభినందించిన ప్రధాని
న్యూఢిల్లీ, జూలై 4,
విశ్వవిజేతలు ప్రధాని మోదీని కలిశారు. బార్బడోస్ నుంచి ఢిల్లీకి చేరిన భారత ఆటగాళ్లు… ప్రధానమంత్రి అధికారిక నివాసంలో మోదీని కలిశారు. టీ 20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఎంత భావోద్వేగానికి గురయ్యామో… ఆటగాళ్లు మోదీకి వివరించారు. పొట్టి ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లను మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతీ ఆటగాడు తమ అనుభవాలను మోదీకి వివరించారు.
ప్రత్యేక అభినందన
భారత క్రికెట్ జట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది.. ఈ సందర్భంగా టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టును ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. టీ20 వరల్డ్ కప్‌తో బార్బడోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న టీమిండియాకు ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. అనంతరం ఐటీసీ మౌర్యా హోటల్ కు చేరుకున్న క్రికెటర్లు కాసేపు రెస్ట్ అనంతరం.. లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకున్నారు. తన ఇంటికి చేరుకున్న టీమిండియా ప్లేయర్స్ తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టును మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్.. కార్యక్రమంలో భాగంగా మోదీ.. క్రికెటర్లతో ప్రత్యేకంగా సంభాషించారు.. టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు ప్రదర్శన.. ఫైనల్ మ్యాచ్ తదితర అంశాలను స్వయంగా అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ జట్టు సభ్యులతో కలిసి ఫొటో దిగారు
క్రికెటర్స్ ను అభినందించిన ప్రధాని
- Advertisement -
- Advertisement -



