మెప్మా ఆర్పిల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
The problems of Mepma RPs should be addressed immediately
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జీ.వేణుగోపాల్ డిమాండ్
బద్వేలు ఉ
16 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పిలను ఉద్యోగ భద్రత కల్పించి రాష్ట్ర ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ ఆధారంగా జీతాలు ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పి రూ.26 వేలు కనీన వేతనం నేరుగా బ్యాంకు అకౌంట్‌ల్లో జమ చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జీ.వేణుగోపాల్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేసి.బాదుల్లా లు విజ్ఞప్తి చేశారు.శనివారం ఎస్టీయు కార్యాలయంలో మెప్మా ఆర్పీల సమావేశం కళావతి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జీ.వేణుగోపాల్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేసి.బాదుల్లా లు మాట్లాడుతూ పట్టణ ప్రగతి, బీఎల్ఓ డ్యూటీలు, మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించడం, స్త్రీ నిధి ఇలా అనేక రకాల పనులు ప్రభుత్వం మెప్మా ఆర్సీలతో చేయిస్తుందన్నారు.
ఆర్పీలకు 2019లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 3సం కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని, ఏ కారణంతోనైనా మృతి చెందిన ఆర్పీలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌చేశారు.
జీతం మాత్రం నెలకు రూ.10వేలు రూ ప్రభుత్వాలు ఇస్తామని 6 వేలు, 8వేలు మాత్రమే చెల్లిస్తుందన్నారు. కేవలం రూ.6 వేలతో కుటుంబాన్ని ఎలా పోషించాలని ప్రశ్నించారు.
ఆర్పీలందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన డ్రస్ కోడ్ అమలు చేయాలని, వేతనాలు ప్రభుత్వం వ్యక్తిగత ఖాతాలలో జమ చేయాలని, ఆర్పిలందరికీ గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.
ఆర్పీల పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలు తక్షణ విడుదల చేయాలని చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వాలు మారినా వీరి తలరాతలు మారలేదన్నారు. గొడ్డు చాకిరీ చేస్తున్న వీరికి కనీస వేతనం అమలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్‌పిలకు ఇచ్చేది తక్కువ వేతనమైనా ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో చాలా మందికి రూ.ఐదు వేలకు మించి వేతనం రావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సభలకు, కార్యక్రమాలకు మహిళలను తరలించేందుకు కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. అలాగే ఆర్‌పిలకు లాగిన్ ఇవ్వకుండా వేధిస్తున్నారని అన్నారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షలు పీ.సుబ్బారాయుడు ఆర్పిలు బీబి,శ్రీదేవి, విజయలక్ష్మి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
మెప్మా ఆర్పిల అసోషియేషన్ (ఏఐటీయూసీ అనుబంధం) సమితి ఎన్నిక
గౌరవ అధ్యక్షులు : కేసీ.బాదుల్లా
అధ్యక్షురాలు : డి.సుజాత
ప్రధాన కార్యదర్శి : యన్ . విజయలక్ష్మి
ఉపాధ్యక్షురాలు : బి.చంద్రకళ, కే.క్రాంతి
సహాయ కార్యదర్శులు : పి. శ్వేత, జి.రామలక్ష్మి
కోశాధికారి : కే.సరస్వతి లను ఎన్నుకున్నారు.