రైతు రూణాల మాఫి ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలి
సిద్దిపేట
The process of waiver of farmers’ runas should be completed quickly
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతురూణమాఫీ ప్రక్రియ మొదటి విడతలో 1లక్ష రూపాయల లోపు లోన్ తీసుకున్న రైతు రూణాల మాఫి ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి బ్యాంకు అధికారులను ఆదేశించారు.గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో గల వివిద బ్యాంకు అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.
జిల్లాలో 53,128 రైతుల ఖాతాల్లో 1లక్షరూపాయల రూణ మాఫీ అవుతుందని తెలిపారు. ఈ రుణమాఫీ 12-12-2018 నుండి 9-12-2023 మద్య కాలంలో తీసుకున్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది. రైతులు గాబారా పడకుండా ప్రతి మండల కేంద్రాలలో గ్రీవెన్స్ రిట్రెసల్ సెంటర్ ఏర్పాటు చెస్తున్నట్లు అందులో ఏఓ, ఏఈఓ లు సెంటర్ లలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివరాలను అందిస్తారు.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేషన్ కార్డు కుటుంబంలో ఉన్న సభ్యుల గుర్తింపు కోరకు మాత్రమే. కాని రేషన్ కార్డు లేని ఈ రుణమాఫీ కి ఆర్హులైన రైతుల పాస్ బుక్ ఆధారంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి వారి వివరాలను సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు తెలిపారు. రోజు వారిగా బ్యాంకు లో రూణాలు మాఫీ అయిన వివరాలను సేకరించి తనకు అందివ్వాలని ఎల్డిఎం కి తెలిపారు. బ్యాంకు ల వద్ద రైతులు ఆందోళనకు గురికాకుండా క్రమశిక్షణ పాటించడం కోసం పోలిస్ బందోబస్తు మరియు పోలిస్ పికెటింగ్ ఏర్పాటు చెయ్యాలి. రైతులు సమ్యయనం పాటించీ ప్రతి బ్యాంకు అధికారులను కలిసి క్రాప్ లోన్ రిన్వెల్ చేసుకునేందుకు బ్యాంకు అధికారులకు సహకరించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకు అధికారులకు సహకారం అందించాలని, ఎలాంటి సమస్యలు ఎదురైన జిల్లా అగ్రికల్చర్ అధికారి, ఎల్డీఎం అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అందరూ అధికారుల సమన్వయం పాటించి లక్ష రైతు రుణమాఫీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎల్డిఎం హరిబాబు, డిఎఓ మహేష్, యుబిఐ, ఎపిజీవిబి ఆర్ ఎంలు వికాస్ ఉదయ్ కిరణ్, మెదక్ డిసిసిబి డిజిఎం విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


