- Advertisement -
భారీనష్టం మిగిల్చిన వర్షం
The rain caused heavy damage
డోర్నకల్
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం డోర్నకల్ నియోజక వర్గంలో బారి నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో 38 వేల ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనా వేశారు. సుమారు 40 కుటుంబాలకు సంబంధించిన ఇండ్లు కూలిపోయి నిరాశ్ర యులుగా మిగిలి పోయారు. వందల కొద్దీ పశువులు వరదలో కొట్టుకొనిపోయాయి. సుమారు 200ఎకరాల వ్యవసాయ భూములు కోతకు గురవడం భవిష్యత్తు లో పంటకు ఉపయోగ పడకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజక వర్గంలో నీ పురుషోత్తమా యా గూడెం,బాల్ని ధర్మారం,చిన్న గూడూరు,మల్కల పల్లి శివారులోని బ్రిడ్జి లు పూర్తి స్థాయిలో ధ్వంసం అయ్యాయి. వివిధ గ్రామాల్లో నీ ఇళ్ళల్లో సామాగ్రి పూర్తి స్థాయిలో పనికి రాకుండా పోవడం బాధితులను ఆందోళన కు గురిచేస్తుంది. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నప్పటికి పూర్తి గా అందక పోవడం తో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని ముంపు గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు..
- Advertisement -