Sunday, September 8, 2024

భూ కబ్జా రాయిల్ల గుండెల్లో రైళ్లు పరుగులు తీయించిన ‘ రియల్ హీరో ‘

- Advertisement -

వరంగల్ పోలీస్ కమిషనరేట్ మీద చెరగని ముద్ర వేసిన ఏ.వి.ఆర్…
– ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారానికి తనదైన శైలిని చూపిన విధానం..
– బాధితులు నేరుగా సి.పి. కలిసే విధంగా గ్రీవెన్స్ ఏర్పాటు..

warangal-police-commissioner-a-v-ranganath-transfer
warangal-police-commissioner-a-v-ranganath-

– భూ కబ్జా రాయిల్ల గుండెల్లో రైళ్లు పరుగులు తీయించిన ‘ రియల్ హీరో ‘…

వరంగల్ క్రైం బ్యూరో (వాయిస్ టుడే ప్రతినిధి)

నల్గొండ జిల్లాకు చెందిన రంగనాథ్‌ తొలుత గ్రూప్‌-1 అధికారిగా ఎంపికై 2002 నుంచి 2003 వరకు వరంగల్‌ జిల్లా నర్సంపేటలో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. 2006లో కన్ఫర్డ్‌ ఐపీఎ్సగా పదోన్నతి పొంది పలు జిల్లాలలో ఎస్పీగా సమర్థవంతగా పనిచేశారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఎస్పీగా, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. అక్కడి నుంచి గ‌త ఏడాది న‌వంబ‌ర్ 22న వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్‌గా వ‌చ్చారు. పంద‌కొండున్నర నెల‌ల కాలం పాటు క‌మిష‌న‌ర్‌గా విధుల్లో ఉన్న ఆయ‌న పోలీసుల ప‌నితీరు, పోలీస్‌శాఖ‌పై త‌న‌దైన ముద్రను చూపించారు. ముఖ్యంగా భూ క‌బ్జాల‌కు పాల్పడుతున్న ముఠాల‌ను, రౌడీల‌ను, ప్రజాప్రతినిధుల‌ను క‌ట‌క‌టాల వెన‌క్కి పంపి పోలీస్ ప‌వ‌ర్ అంటే ఏంటో చూపించారు. గంజాయి, సైబర్‌ నేరాలు, క్రికెట్‌ బెట్టింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. నిత్యం పోలీసు అధికారులతో సమీక్ష చేస్తూ లాఅండ్‌అర్డర్‌ నిర్వహణలో సూచనలు చేశారు. భూక‌బ్జాదారుల్లో, పోలీస్ శాఖ‌లో అవినీతి, అక్రమాల‌కు పాల్పడుతున్న అధికారుల‌పై ఎప్పటిక‌ప్పుడు వేటు వేస్తూ వారిలో వ‌ణుకుపుట్టించారు. ఎప్పటిక‌ప్పుడు అధికారుల ప‌నితీరుపై స‌మీక్ష, ఫీడ్ బ్యాక్, ఎంక్వయిరీతో స‌స్పెన్షన్ల వేటు వేయ‌డంతో డిపార్ట్‌మెంట్ సెట్ రైటయింద‌నే చెప్పాలి.”
“బాధితులు నేరుగా సీపీని క‌లుసుకునే విధంగా గ్రీవెన్స్‌ను కొన‌సాగించ‌డంతో అనేక కేసుల‌పై త్వరిత‌గ‌తిన ప‌రిష్కారం చూపేందుకు అవ‌కాశం క‌లిగించారు. భూ క‌బ్జాదారుల అరెస్టు విష‌యంలో పొలిటిక‌ల్ ప్రెష‌ర్‌ను త‌ట్టుకుని మ‌రీ ఆయ‌న త‌ట్టుకుని ముందుకెళ్లడం జ‌నం దృష్టిని ఆక‌ర్షించింది. వంద‌లాది మంది భూ బాధితుల‌కు న్యాయం చేయ‌డంతో ఆయ‌న‌కు క్షీరాభిషేకాలు చేయ‌డం గ‌మ‌నార్హం. భూ క‌బ్జాదారుల‌పై సీపీ వ్య‌వ‌హ‌రించిన తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా హ‌ర్షాతిరేకాలు వ్యక్తమ‌య్యాయి. పోలీస్‌శాఖ‌పై సామాన్య ప్రజానీకానికి న‌మ్మకం, గౌర‌వాన్ని పెంపొందించాయి. స్ట్రిక్ట్‌గా ఆఫీస‌ర్‌గా, ముక్కుసూటిగా వ్యవ‌హరిస్తాడ‌ని రంగ‌నాథ్‌కు మొద‌ట్నుంచి డిపార్ట్‌మెంట్‌లో పేరుంది. అదే తీరును వ‌రంగ‌ల్‌లో కొన‌సాగించారు. ఇంకా చెప్పాలంటే చాలా దూకుడుగా వ్యవ‌హ‌రించి ప్రజ‌ల మ‌న్నన‌ల‌ను పొందారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్