Monday, March 23, 2026

ఐక్యమత్యం ప్రదర్శించినప్పుడే చట్టసభల్లో బీసీలకు సంఖ్య పెరుగుతుంది: మధుయాష్కి గౌడ్

- Advertisement -

ఐక్యమత్యం ప్రదర్శించినప్పుడే చట్టసభల్లో బీసీలకు సంఖ్య పెరుగుతుంది: మధుయాష్కి గౌడ్

కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం చైర్మన్‌గా వీర్లపల్లి శంకర్, కన్వీనర్లుగా ధనలక్ష్మి, వెంకటేష్ ప్రమాణస్వీకారం

The representation of BCs in legislative bodies will increase only when they demonstrate unity: Madhu Yashki Goud.

గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కన్వీనర్లుగా డాక్టర్ జూలూరు ధనలక్ష్మి, డాక్టర్ కేతూరి వెంకటేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్, ధనలక్ష్మి, వెంకటేష్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిటి శ్రీహరి, సీనియర్ నేత వి. హనుమంతరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యమత్యం లేకపోవడం వల్లే బీసీ అభ్యర్థులు పోటీ చేసిన చోట ఓడిపోతున్నారని పేర్కొన్నారు. పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు బీసీలు ఐక్యంగా ఉండి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మర్చిపోతున్నారని అన్నారు.

ఎంబీసీకి చెందిన వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభలో తన వాణిని వినిపిస్తున్న తీరు అభినందనీయమన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ధనబలం పెరిగిన నేపథ్యంలో ఆర్థికంగా ఎదుర్కోవడం కష్టమైందని, ఐక్యమత్యంతోనే బీసీలను ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం ఐక్యత అవసరమన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారు వ్యక్తిగత ప్రయోజనాలకే కాకుండా తమ పదవీకాలంలో బీసీ సమాజం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

దేశవ్యాప్తంగా 38 జాతీయ స్థాయి బీసీ కుల సంఘాలతో చర్చించిన తర్వాతే కులగణన అవసరం, జనాభాకు అనుగుణంగా అవకాశాలు, సామాజిక న్యాయం అంశాలను రాహుల్ గాంధీ ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఆయన మార్గదర్శకంలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టారని వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, నవీన్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్, మెట్టు సాయికుమార్, నిర్మల, నేతలు డాక్టర్ వినయ్ కుమార్, కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్