Thursday, December 12, 2024

రైతుల పట్ల  రేవంత్ రెడ్డి  ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం:బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్

- Advertisement -

రైతుల పట్ల  రేవంత్ రెడ్డి  ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం
              రాష్ట్రంలో పంట విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా తగ్గింది
ఉద్యానవనాలు, పశుసంపద, పాడిపరిశ్రమ, కోళ్లపరిశ్రమ అదోగతి పాలైంది
రైతు రుణమాఫీ ఏ విధంగా చేయగలుగుతారనే విషయాన్ని స్పష్టం చేయాలి
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ డిమాండ్
హైదరాబ్నాద్ మే 16
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైతుల కడగండ్లను పట్టించుకునే స్థితిలో లేరు. ఎన్నికల కంటే ముందు రైతులను తన మాటలతో మభ్యపెట్టి, విజయం సాధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ  రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా గాలికొదిలేసింది. రాష్ట్రంలో పంట విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా తగ్గింది. వ్యవసాయానికి కరెంటు కోతలు పెరిగాయి. కాల్వలకు నీళ్లు అందని పరిస్థితి నెలకొంది. అనావృష్టితో, అకాల వర్షాలతో పంటనష్టం జరిగితే ప్రభుత్వం మొక్కుబడిగా పరిహారం చెల్లిస్తామని ప్రకటించి.. రెండుసార్లు రైతులను మోసం చేసింది. వరి కోతలు కోసి ధాన్యం కుప్పలుగా పేరుకుపోతే.. కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతోందని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై విరుచుకుపడ్డారు. మరోవైపు ధాన్యం కొనుగోలు చేస్తుందని రైతులు ఎదురుచూస్తుంటే.. ఇంకా రాష్ట్రంలోని చాలా మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనేలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్‌ వచ్చి కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పారు. ఆ హామీ అమలుకు నోచుకోలేదు. లక్ష రూపాయల మేరకు రైతు రుణమాఫీ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లు తాత్సారం చేసింది. ఇప్పటికీ ఆ రుణమాఫీ కాక అనేక మంది రైతుల పాసుపుస్తకాలు తనఖాపై బ్యాంకుల్లో ఉన్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకునేందుకు హామీల మీద హామీలు ఇచ్చింది. రూ. 2 లక్షలు మాఫీ చేస్తామని గొప్పలు చెప్పారు. మాఫీ చేయనేలేదు. రైతుబంధు విషయంలోనూ జాప్యం చేస్తూనే ఉన్నారు.రైతు కార్పొరేషన్ అంటూ మళ్లీ కొత్తగా మాటలు చెబుతున్నారు. ఒకవైపు ఎఫ్ఆర్ బీఎం పరిమితి దాటింది. ఇప్పడు కార్పొరేషన్ కు రుణం దక్కాలంటే బడ్జెటేతర రుణం కావాలి. అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ ఏ విధంగా చేయగలుగుతారనే విషయాన్ని స్పష్టం చేయకుండా.. తాత్సారం చేస్తూ రైతులను శాశ్వతంగా రుణగ్రస్తులుగా చేస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం రైతు సహకార రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మరోవైపు సబ్సిడీ విత్తనాలు, డ్రిప్, స్ప్రింకర్లు ఇవ్వకుండా గాలికొదిలేసింది. పంటనష్టపరిహారం ఇవ్వకుండా రైతులను తిప్పల పెడుతోంది ఫసల్ బీమాను అమలు చేస్తామని చెప్పినప్పటికీ.. ప్రభుత్వపరంగా పంట విస్తీర్ణానికి రాష్ట్ర వాటా కట్టడానికి ముందుకు రాలేదు. కేవలం పేరుకు మాత్రమే ఫసల్ బీమాను అమలు చేస్తామని చెప్పిందని,మరోవైపు ఉద్యానవనాలు, పశుసంపద, పాడిపరిశ్రమ, కోళ్లపరిశ్రమ అదోగతి పాలైంది. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభం వైపు నెట్టబడుతుతోంది. రాష్ట్రంలో దివాళా తీసిన ఖజానాతో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే కొత్త కార్పొరేషన్ ఏర్పాటు అంటూ మాటలు చెబుతున్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరిగతిన సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారూ. రైతు సంఘాల ప్రతినిధులు, మేధావులతో సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలపై చర్చించి, పరిష్కరించాలని డిమాండ్ చేసారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉచిత విద్యుత్తును రోజురోజుకు నీరుగార్చుతోంది. ఉచిత విద్యుత్ ను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని, అఖిలపక్ష సమావేశంతో పాటు రైతు సంఘాల ప్రతినిధులతో యుద్ధ ప్రాతిపదికన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారూ.పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రస్తావించిన అంశాలను లోతుగా పరిశీలిస్తే రెండు పార్టీల మధ్య రాజకీయ బంధం, అనుబంధం, సంబంధం చాలా ప్రగాఢంగా ఉందనేది అర్థమైంది. అభ్యర్థుల ఎంపికలో కనపడింది.. ఎన్నికల ప్రచారంలో బలపడింది. ఓటింగ్ సరళిని చూస్తే అదే విషయం బయటపడింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిజెపిని నిరోధించేందుకు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కాపాడారు. నేడు మళ్లీ బిజెపిని నిరోధించేందుకు, గెలుపును అడ్డుకునేందుకు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం ప్రచారం వ్యవహారంలో, అభ్యర్థుల ఎంపికలో బట్టబయలైంది. వారు ఎన్నిరకాలుగా కుట్రలు పన్నినా, కపట నాటకాలు ఆడినా రాష్ట్రంలో బిజెపి గెలుపును ఆపలేరని హెచ్చరిస్తున్నాం. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని భావిస్తున్నట్లు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్