- Advertisement -
సిట్ తో పేదల బియ్యం మాఫియా ఆగడాల ఆటకట్టు
The rice of the poor with the SIT is a plaything for the mafiaఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ,
విజయవాడ
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన “ సిట్ “ పేదల బియ్యం దోపిడీ ముఠా ఆట కట్టిస్తుంది. కాకినాడ పోర్టులో కూలీలకు పని కల్పించడం అంటే అక్రమ అవినీతి బియ్యం వ్యాపారంతో కాదు, సక్రమమైన ఎగుమతులు – దిగుమతుల వ్యాపారంతో అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడాలని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు.
కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చాలని రెట్టింపు బియ్యం ఇస్తే, కాకినాడ పోర్టు నుండి రెట్టింపు బియ్యం విదేశాలకు వెళ్లిందని లెక్కలు చెబుతున్నాయి. పేదల బియ్యం దోపిడీ పైన “సిట్“ అనగానే కలుగులో ఉన్న అవినీతిపరులు స్టాండ్, అటెన్షన్ అండ్ రన్ అనే పరిస్థితికి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బియ్యం ఎగుమతి చేస్తున్న నౌకను ఆపడం వెనక ఉన్న స్ఫూర్తి ముఖ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కేవలం పేదలకు ఉచిత బియ్యం కోసం సంవత్సరానికి సగటున 16 వేల కోట్లు వెచ్చిస్తున్న నిధులుదుర్వినియోగం కావడం బాధాకరమని అన్నారు.
ప్రస్తుతం దాదాపు 10 వేల కోట్లు కేంద్రానికి, 6 వేల కోట్లు రాష్ట్రానికి ఉచిత బియ్యం కోసం వ్యయం అవుతుంది, గడచిన 5 సంవత్సరాలలో రమారమి మొత్తం 80 వేల కోట్లు ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం 50 వేల కోట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి 30 వేల కోట్లు ఖర్చు అయ్యింది . 2019 – 24 మధ్య గరీబ్ కు అందాల్సిన 80 వేల కోట్ల ఉచిత బియ్యంలో సింహ భాగం అవినీతిపరులకు ఆదాయ మార్గంగా మారింది. పేదల ఆకలి తీర్చాల్సిన బియ్యం దోపిడీతో వారి కడుపు కొట్టి జేబులు నింపుకోవాలనుకునే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు సిగ్గుతో తలదించుకోవాలి. దోపిడీదారుల ఆగడాలను నిలువరించి అర్హులైన పేదల ఆకలి తీరేవిధంగా బియ్యం పంపిణీలో సంస్కరణలు సూచించాల్సిన అవసరం ఉంది. పేదలకు పట్టెడు అన్నం పెట్టడానికి అన్న ఎన్టీఆర్ 2/- కిలో బియ్యం పథకం ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోడీ జీ గరీబ్ కల్యాణ్ అన్న యోజన ప్రారంభించారు, దీనికి అదనంగా జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద ఇచ్చే బియ్యం అదనం. మేము ఏదో అలాటప్పగా ఇప్పుడు బియ్యం దోపిడీ పైన మాట్లాడ లేదు, గత మూడు సంవత్సరాలుగా స్థిరమైన వాస్తవిక సమాచారంతోనే ప్రజల ముందుకెళ్తున్నాం. 10 అక్టోబర్ 2024న సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులను ప్రభుత్వ ఉచిత బియ్యం సమీక్ష కోసం సమాచారాన్ని అడగడం జరిగింది. బియ్యం దోపిడీ పైన సమాచార హక్కు చట్టం ద్వారా మా తొవ్వకం జూలై 2022లో మొదలైంది. 11 నవంబర్ 2022న లభించిన పూర్తి సమాచారంతో మొదటి సారి స్థానిక మరియు జాతీయ మీడియా ద్వార బియ్యం దోపిడీ పైన మేము వివరాలు ఇవ్వడం జరిగింది. మరింత సమాచారంతో “ విదేశాలకు పేదల బియ్యం “ అనే వ్యాసం 28 నవంబర్ 2022న జాతీయ వెబ్సైట్ లో, 21 డిసెంబర్ 2022న తెలుగులో రాయడం జరిగింది.
పలు సందర్భాలలో బియ్యం అవినీతి పైన ప్రశ్నిస్తూనే టీడీపీ జాతీయ కార్యాలయంలో 22 ఏప్రిల్ 2024న కూటమి నాయకుల విలేఖరుల సమావేశంలో బియ్యం దోపిడీ లెక్కలతో సహా వివరించామని అన్నారు.
- Advertisement -




