మన నగరానికి సరైన ఎంపిక : చల్లా హరి శంకర్ – స్వరూప రాణి
The right choice for our city: Challa Hari Shankar – Swaroop


చల్లా హరి శంకర్ గెలిస్తే మేయర్ అవకాశం? : గంగుల కమలాకర్
కరీంనగర్ ప్రతినిధి | వాయిస్ టుడే
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు.
గత రెండేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని ప్రభుత్వాలు, రాబోయే మూడేళ్లలో ఏమి అభివృద్ధి చేస్తాయని ఆయన ప్రశ్నించారు.
“రెండేళ్లలో ఏం అభివృద్ధి చేశారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి?
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు” అని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
“రెండేళ్లలో మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. మన అభ్యర్థులను గెలిపిస్తే, మన ప్రభుత్వం రాగానే అన్ని అభివృద్ధి పనులు చేపడతాం” అని ప్రజలకు హామీ ఇచ్చారు.
గురువారం రోజున 47వ, 21వ డివిజన్ల బీఆర్ఎస్ అభ్యర్థులు చల్ల స్వరూప రాణి, చల్లా హరి శంకర్ నామినేషన్ కార్యక్రమానికి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముందుగా రాంనగర్‌లోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని డివిజన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన గంగుల కమలాకర్,
“ఈ రెండేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ నగరానికి రెండు రూపాయలు కూడా తీసుకురాలేదు. పొన్నం ప్రభాకర్ గాని, బండి సంజయ్ గాని నగరానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు” అని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1650 కోట్ల రూపాయలతో కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని ఆయన గుర్తు చేశారు.
కేవలం ఎన్నికల కోసం వచ్చే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాలనలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించిన ఆయన,
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, బీజేపీ పార్టీ ఎన్నటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అన్నారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అని పేర్కొంటూ,
రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.
డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడే చల్ల స్వరూప రాణి, చల్లా హరి శంకర్‌లు డివిజన్లను అన్ని విధాల అభివృద్ధి చేశారని,
ప్రజల ఇంటి బిడ్డలుగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేశారని ప్రశంసించారు.
డిప్యూటీ మేయర్‌గా ఇంత అభివృద్ధి చేస్తే, బీఆర్ఎస్ పార్టీ మళ్లీ మేయర్ పీఠం కైవసం చేసుకున్న తర్వాత ఒక మేయర్‌గా డివిజన్లను మరింత అభివృద్ధి చేస్తారని గంగుల కమలాకర్ తెలిపారు.
అందుకే ప్రజలు తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంట ఆయన సోదరులు గంగుల సుధాకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



