- Advertisement -
బ్యాంక్ అలరాం మ్రోగడంతో దొంగలు పరార్..
The robbers escaped after the bank alarm went off
తాండూర్..
బ్యాంకు ఎటిఎం ను లూటీ చేయడానికి వచ్చిన దొంగలకు బ్యాంక్ అలారం మ్రోగడంతో ముగ్గురు దొంగలు పరారయ్యారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ ఎస్బిఐ బ్యాంక్ నందు చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత అర్ధరాత్రి తర్వాత ఒంటిగంట సమయంలో మండల పరిధిలోని ఎస్బిఐ బ్యాంకు నందుగల ఏటీఎం లో ఉన్న నగదును చోరీ చేసేందుకు వచ్చిన దొంగలు మొదట బ్యాంకులోకి ప్రవేశించి ఏటీఎంకు సరఫరా విద్యుత్ వైర్లను కట్ చేశారు. తర్వాత ఏటీఎం ను లూటీ చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా బ్యాంకు అలారం మోగింది. దీంతో అక్కడికి వచ్చిన ముగ్గురు దొంగలు పరారయ్యారు. దొంగలు మాస్కులు ధరించి ఉండటంతో వారి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు ఎవరైనా దొంగలను గుర్తుపడితే సమాచారం అందించాలని పోలీసులు ప్రకటనలో తెలిపారు
- Advertisement -