28.7 C
New York
Sunday, June 23, 2024

జూన్ 4 తర్వాత గులాబీ దుకాణం క్లోజ్

- Advertisement -

. జూన్ 4 తర్వాత గులాబీ దుకాణం క్లోజ్
హైదరాబాద్, మే 23
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ నాలుగు తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కారు బయటకు రారన్నది ఆయన మాట. ఇదేమీ జోస్యం కాదని, పక్కా చెబుతున్నానని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కీలక విషయాలు వెల్లడించారు.లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతలను ఆ పార్టీ కార్యకర్తలు వెంటపడి తరిమి తరిమి కొడతారన్నారు మంత్రి కోమటిరెడ్డి. వీళ్లది నియంత పాలన అని చెప్పుకొచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని కేటీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఏమైనా అంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చిరించారు.కేటీఆర్ బచ్చా అంటూనే, తండ్రి పేరు చెప్పుకుని మంత్రి అయ్యారని ఎద్దేశా చేశారు మంత్రి. రాష్ట్ర సంపదనంతా దోచుకున్నది చాలక ఢిల్లీకి కేసీఆర్ ఫ్యామిలీ వెళ్లిందని ఆరోపించారు. మద్యం కేసులో అవినీతి చేయకుండానే ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారులు 8 వేల పేజీల ఛార్జిషీటు దాఖలు చేశారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పులను మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు.ప్రభుత్వ ఆసుపత్రుల భవనాలు 14 అంతస్తులు మించరాదని నిబంధనలు చెబుతున్నాయిని, ఎల్బీనగర్ ఆసుపత్రి స్థలానికి ఎన్‌వోసీ లేకుండా నిర్మాణం చేపట్టారని దుయ్యబట్టారు మంత్రి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కట్టిన భవనాలకు మున్సిపల్ ఆఫీసు నుంచి అనుమతి తీసుకోలేదన్నారు. మున్సిపల్ అధికారులు వాటిని టేకోవర్ చేసుకుంటారన్నారు. కేటీఆర్, హరీష్‌రావులు.. కేఏపాల్ మాదిరిగా తయారు కావద్దని హితవు పలికారు. ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!