Monday, July 14, 2025

సీఆర్పీఎఫ్ బలగాల త్యాగాలు సేవలను మరువలేం:కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

- Advertisement -

పారామిలిటరీ బలగాల్లో అత్యుత్తం సీఆర్పీఎఫ్

The sacrifices and services of CRPF forces will never be forgotten: Union Minister Bandi Sanjay Kumar

సీఆర్పీఎఫ్ బలగాల త్యాగాలు సేవలను మరువలేం:

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

హైదరాబాద్

ఉగ్రవాద మావోయిస్టుల నిర్మూలనలో సీఆర్పీఎఫ్ పాత్ర కీలకం
. అత్యాధునిక ఆయుధాలను అందిస్తాం.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.

జంషేడ్ పూర్ లో సీఆర్పీఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన బండి సంజయ్

జమ్మూ కాశ్మీర్‌ సహా దేశంలోని ఉగ్రవాదం, వేర్పాటువాదం ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదంతోపాటు మావోయిస్టుల ఏరివేతలో సీఆర్పీఎఫ్ బలగాలు చూపుతున్న తెగువ అద్బుతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.  దేశంలోని అంతర్గత శాంతి భద్రతలను పరిరక్షించడంలో సీఆర్పీఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. దేశ అంతర్గత భద్రత విషయంలో సీఆర్పీఎఫ్ బలగాల త్యాగాలను వెలకట్టలేనివని అభివర్ణించారు.
రాంచిలోని బిర్సాముండా విమానాశ్రయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడి నుండి బిఎస్ఎఫ్, హెలికాప్టర్ ఎం ఐ 17, లో జంషేడ్ పూర్ వెళ్లారు. విప్లవ వీరుడు బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి సీఆర్పీఎఫ్ కేంద్రానికి వెళ్లిన బండి సంజయ్ నూతనంగా నిర్మించిన పలు సీఆర్పీఎఫ్ భవనాలను ప్రారంభించారు. అందులో 480 టైప్-2 మరియు 24 టైప్-3 కుటుంబ నివాస గృహాలు, 20 పడకల ఆసుపత్రి, స్టోర్ బిల్డింగ్, ట్రేడ్స్‌మెన్ షాప్, 180 మందికి గల మెన్ బ్యారక్ లు ఉన్నారు.  ఈ సందర్భంగా  నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎంపీ విద్యుత్ బరణ్ మహతో అదనపు డీజీ అమిత్ కుమార్, ఐపీఎస్ అధికారులు శాలినీ, సాకేత్ కుమార్ తోపాటు పలువురు పోలీసు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైనవారికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు.
సిఆర్.పీ.ఎఫ్. జవాన్లు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ భద్రత కోసం, ప్రత్యేకించి తీవ్రమైన దుర్భర ప్రాంతాల్లో  విధులు నిర్వహిస్తూ మాతృభూమికి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. వారి సేవలను ద్రుష్టిలో ఉంచుకుని  జవాన్లకు, అధికారులకు వారి కుటుంబాలతో నివసించేందుకు వీలుగా గృహ నిర్మాణాల్ని నిర్మిస్తున్నాం. ఈ గ్రుహ నిర్మాణాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే జంషేడ్ పూర్ లోని సీఆర్పీఎఫ్ గ్రూప్ కేంద్రంలో 165 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన 480 టైప్-2,  24 టైప్-3 కుటుంబ ఆవాసాలతోపాటు భండార్  భవనం, ట్రేడ్స్‌మెన్ షాప్, 20 బెడ్ల ఆసుపత్రి, అధికారుల మెస్, 180 మందికి సరిపడా మెయిన్ బ్యారక్ లను నిర్మించడంతోపాటు  నా చేతుల ద్వారా వాటిని ప్రారంభించడాన్ని గర్వంగా భావిస్తున్నాను. విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లు, అధికారులు తమ కుటుంబాలను సురక్షిత వాతావరణంలో ఉంచి, పిల్లలకు మంచి విద్య అందించడంలో వీలు కల్పించి, ఎటువంటి ఆందోళన లేకుండా దేశ సేవలో మునిగిపోవడానికి ఈ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్