Wednesday, March 25, 2026

 గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కలకలం రేపిన చిన్నారి విక్రయం

- Advertisement -

 గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కలకలం రేపిన చిన్నారి విక్రయం

The sale of a child caused a stir in the Guntur government hospital

గుంటూరు
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి విక్రయం ఘటన కలకలం సృష్టించింది. చిన్నగంజాంకు చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి 1.90 లక్షల రూపాయలకు తన బిడ్డను విక్రయించారు. వివరాల్లోకి వెళితే.. సుబ్రహ్మణ్యం కొద్ది రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తన భార్య లక్ష్మిని డెలివరీ కోసం తీసుకెళ్లాడు. ఆడ శిశువుకు జన్మనిచ్చిన సుబ్రమణ్యం భార్య లక్ష్మి కన్నుమూసింది. గతంలోనే లక్ష్మికి ఎనిమిది మంది సంతానం ఉంది. అదే ఆస్పత్రిలో డెలివరీ కోసం భట్టిప్రోలుకు చెందిన మీరాభి చేరింది. డెలివరీ తర్వాత మీరాభికి పుట్టిన శిశువు ప్రాణాలు విడిచింది. అదే సమయంలో మీరాభి స్నేహితురాలు ప్రభావతి.. సుబ్రమణ్యంతో చిన్నారి కోసం సంప్రదింపులు జరిపింది. తన పాపను ఇచ్చేందుకు సుబ్రమణ్యం అంగీకరించారు.ఈ నెల 7వ తేదీన సుబ్రహ్మణ్యాన్ని ఒప్పించి శిశువును తీసుకువెళ్లేందుకు మీరాభి కుటుంబ సభ్యులతో చిన్నగంజాంకు వచ్చింది. వారు ఎట్టకేలకు సుబ్రహ్మణ్యాన్ని ఒప్పించి శిశువుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బిడ్డ పుట్టి చనిపోవడంతో, తీవ్ర మనోవేదనలో ఉన్న తన మిత్రురాలు మీరాభికి సుబ్రహ్మణ్యం వద్ద కొనుగోలు చేసిన శిశువును స్నేహితురాలు ప్రభావతి తీసుకువచ్చి ఇచ్చింది. బిడ్డ పుట్టి చనిపోయిన మహిళ వద్ద మరో బిడ్డను చూసి అనుమానం వచ్చి జీజీహెచ్‌ సిబ్బంది ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో బిడ్డను 1.90 లక్షలకు కొనుగోలు చేసినట్లు ప్రభావతి ఒప్పుకుంది. శిశువు కొనుగోలుపై కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం కొత్తపేట పోలీసులు కేసును చినగంజం పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్