Wednesday, March 11, 2026

“వానర” సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘లబొరే లబొరే..’ రిలీజ్,

- Advertisement -

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘లబొరే లబొరే..’ రిలీజ్, జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
The second single ‘Labore Labore..’ from the movie “Vanara” is released,
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా “వానర”. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. “వానర” చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్  బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన “వానర” సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘లబొరే లబొరే..’ రిలీజ్ చేశారు. ఈ పాటను మంచి బీట్ తో మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ కంపోజ్ చేశారు. భరద్వాజ్ గాలి సిచ్యువేషన్ కు తగిన యాప్ట్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్, సాయి మాధవ్ ఎనర్జిటిక్ గా పాడారు. ‘లబొరే లబొరే..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ సూడు సూడు మల్లేషు, జుర్రుకుంటా పుల్లైసు, మన వానర వీరుని కహానీ, ఆ లంకను భయపెట్టిన శివుడిని, అరె తోక తోటి కొట్టింది, సింహిక పనిపట్టింది, అనిలాత్మజ హనుములవారే, అరె జెండాపై కపిరాజే రే, లబొరే లబొరే లబ లబ లబ….’ అంటూ ఆకట్టుకుంటుందీ పాట.
నటీనటులు – అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, నందు, ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి, తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్