వాల్మీకి ఆవాసం -(సేవాభారతి) అందిస్తున్న సేవలు ప్రశంసనీయం
జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత
వాల్మీకి ఆవాసంలో పిల్లలకు పుస్తకాలను అందజేసిన మాజీ జడ్పీ చైర్ పర్సన్
ఇలాంటి కార్యక్రమాలు జీవితానికి సంతృప్తినిస్తుంది
జగిత్యాల,
The services provided by Valmiki Awasam -(Sevabharati) are commendable
:వాల్మీకి ఆవాసం -(సేవాభారతి) అందిస్తున్న సేవలు ప్రశంసనీయం జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత -సురేష్ కొనియాడారు.. సోమవారం జగిత్యాల పట్టణంలోని థరూర్ క్యాంప్ వాల్మీకి ఆవాసం లోని పిల్లలకు పుస్తకాల అవసరాల దృష్ట్యా విషయం తెలుసుకొని పిల్లలకు జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత -సురేష్ పుస్తకాలను పంపిణీ చేశారు..ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ వాల్మీకి ఆవాసం -(సేవాభారతి) అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అభినందించారు.
అన్ని దానల్లో కెల్ల విద్యాదానం చాల గొప్పది..!ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే చదువుని వదిలిపెట్టకుడదని పిల్లలకు చెప్పారు.మీరంతా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,మునుముందు వాల్మీకి ఆవాసం సంస్థకు ఎప్పుడు సహయ సహకారాలు అందించడానికి ముందుంటామని తెలియజేశారు…ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,ఉపాధ్యక్షులు వొల్లెం మల్లేశం,కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి,అవాస కార్యదర్శి మధన్ మోహన్ రావు,మాజీ ఏఎంసీ డైరెక్టర్ చెట్ పెల్లి మోహన్ రెడ్డి,ఆవాస కమిటీ సభ్యులు వెంకటేశ్వర్ రావు,బిఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ వైస్ ప్రెసిడెంట్ ప్రణయ్,సెక్రటరీ ప్రతాప్,నాయకులు భగవాన్,చరణ్,మనోజ్,
మణికంఠ తదితరులు పాల్గొన్నారు…