రాజేంద్ర ప్రసాద్ లాంచ్ చేసిన ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట

- Advertisement -

రాజేంద్ర ప్రసాద్ లాంచ్ చేసిన ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట

The song ‘Coco Kokoroko’ from the film *Mugguru Kothulu*, launched by Rajendra Prasad.
జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కించిన చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రలను పోషించగా.. వర్షిక పాశం హీరోయిన్‌గా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మాస్ ఆడియెన్స్‌కి నచ్చే మంచి ఐటం నంబర్‌ను విడుదల చేశారు.
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కో కో కొకొరొకో’ అంటూ సాగే స్పెషల్ ఐటం సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ముగ్గురు కోతులు’ చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
‘కోకో కొకొరొకో’ అంటూ సాగే ఈ పాటకు జగదీష్ అందించిన సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంది. సుహాస్ ఇచ్చిన బాణీ అయితే శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. లాస్య ప్రియ ఆలపించిన పాట కుర్రకారుకి ఇన్ స్టంట్‌గా ఎక్కేసేలా ఉంది. ఈ సాంగ్‌లో ముగ్గురు హీరోలు, వారితో పాటు స్టెప్పులు వేసిన నటీమణి, ఆమె అందాలు హైలెట్ కానున్నాయి. వినోద్, రఘు, సాయి కంపోజ్ చేసిన ఈ పాట థియేటర్లో బ్లాస్ట్ కానుంది.
ఎస్. సుహాస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రాజ్ నోముల కెమెరామెన్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.  మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేస్తున్న ప్రతీ పాట శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. మున్ముందు మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు చిత్ర బృందం రెడీగా ఉంది.
*నటీనటులు:*
తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular