అల్లు సినిమాస్ స్సెషలేంటంటే…
హైదరాబాద్, మార్చి 14, (వాయిస్ టుడే)
The specialty of Allu Cinemas is…
భాగ్య నగరం లో సినిమా ప్రేమికులు ఎక్కువ. ఫలానా థియేటర్‌లో మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందంటే… ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్… ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోని పీసీఎక్స్ (లార్జ్) స్క్రీన్‌లో సినిమా చూడటం కొందరికి ఓ అలవాటు!టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ ఉన్న మన సినిమాలను, హాలీవుడ్ మూవీస్‌ను మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం పీసీఎక్స్ (లార్జ్) స్క్రీన్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ప్రేక్షకులు కొందరు అయితే… వీకెండ్ ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇంకొందరు. ఆ సినీ ప్రేమికుల కోసం హైదరాబాద్ సిటీలో మరొక స్క్రీన్ వచ్చింది. ‘అల్లు సినిమాస్’లోని డాల్బీ సినిమా స్క్రీన్. దాని స్పెషాలిటీ ఏమిటి? అందులో సినిమా ఎందుకు చూడాలి? అంటే… ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలోని పలు థియేటర్లలో మీరు త్రీడీ సినిమా చూసి ఉండొచ్చు. అయితే… ఒక్కసారి ‘అల్లు సినిమాస్’లోని స్క్రీన్ 1 (డాల్బీ సినిమా)లో త్రీడీ ఫిల్మ్ చూడండి. ‘ది బెస్ట్ సినిమాటిక్’ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అవసరం లేదు. టాలీవుడ్ జర్నలిస్టులను అల్లు సినిమాస్ (థియేటర్ విజిట్)కు తీసుకు వెళ్ళారు. సీతా రాములుగా సాయి పల్లవి, రణబీర్ కపూర్… రావణుడిగా యశ్ నటిస్తున్న ‘రామాయణ’ గ్లింప్స్ ప్రదర్శించారు. త్రీడీ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ సూపర్బ్ అని చెప్పాలి.’అల్లు సినిమాస్’లోని ‘డాల్బీ సినిమా’ స్క్రీన్‌లో మెయిన్ ఎట్రాక్షన్ & స్పెషాలిటీ… సౌండ్ క్వాలిటీ. థియేటర్ టోటల్ సీటింగ్ కెపాసిటీ 634. ఇందులో టోటల్ 78 స్పీకర్స్, 165 సౌండ్ ఔట్ లెట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి (మార్చి 12, 2026)కు ఇండియాలోని అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ఇదే. హైదరాబాద్ సిటీలో మొట్టమొదటి స్క్రీన్ కూడా! ఇది ఫ్లాగ్ షిప్ డాల్బీ సినిమా ఆడిటోరియం కూడా!’అల్లు సినిమాస్’ డాల్బీ సినిమా స్క్రీన్‌లో సౌండ్ క్వాలిటీ సూపర్బ్ అని చెప్పవచ్చు. వరల్డ్ క్లాస్ లెవల్ హియరింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ప్రతి చిన్న సౌండ్, బీట్ చాలా స్పష్టంగా వినబడుతుంది. అందువల్ల ఆర్ఆర్ (నేపథ్య సంగీతం) పరంగా ఈ స్క్రీన్ నెక్స్ట్ లెవల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
విజువల్ ఎక్స్‌పీరియన్స్ కూడా సూపర్బ్
ప్రపంచంలోని అతి పెద్ద స్క్రీన్‌లలో అల్లు సినిమా డాల్బీ సినిమా స్క్రీన్ ఒకటి. ఈ స్క్రీన్ సైజ్ 75 అడుగుల వెడల్పుతో ఉంది. ఫ్లాట్ యాస్పెక్ట్ రేషియోలో ఇందులో సినిమాలను ప్రదర్శించనున్నారు. ఇండియాలో ఇంత పెద్ద డాల్బీ సినిమా స్క్రీన్, హైదరాబాద్‌లోనూ ఇంతకు ముందు లేదు. డాల్బీ సినిమా డిజైన్ ప్రమాణాల ప్రకారం… డ్యూయల్ డాల్బీ విజన్, 6P లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్ కలిగి ఉంది. ఎక్స్‌ట్రీమ్ బ్రైట్ నెస్, డీపర్ బ్లాక్స్, రిచ్‌లీ వైబ్రెంట్ కలర్స్‌తో ఈ సినిమా హాలులో విజువల్ క్వాలిటీ కూడా ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.ఫ్లాగ్ షిప్ డాల్బీ సినిమా స్క్రీన్ కాకుండా ‘అల్లు సినిమాస్’లో మరో మూడు స్క్రీన్‌లు ఉన్నాయి. వాటిలో బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఆ మూడింటి సీటింగ్ కెపాసిటీ 717 సీట్లు.



