డిండి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తె
The state government has approved the Dindi lifting scheme
1800 కోట్లు కేటాయింపు
ముఖ్యమంత్రి కి జిల్లా మంత్రులకు ధన్యవాదాలు
– సిపిఐ
హైదరాబాద్
ఫ్లోరైడ్ తో జీవచ్ఛవాలుగా కరువు ఎడారితో ఉన్న మునుగోడు దేవరకొండ నియోజకవర్గం సాగు,తాగునీరు అందించే దిండి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ 1800 కోట్లు కేటాయించి ఏదుల నుండి నీరు
తీసుకొనుటకు ఆమోదం తెలిపినందుకు సిపిఐ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లను సిపిఐ ప్రతినిధి బృందం ధన్యవాదాలు తెలిపింది. ఈ బృందం లో సిపిఐ జాతీయ
కమిటీ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి నెల్లికంటి సత్యం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి మాజీ శాసనసభ్యులువి యాదగిరిరావు తదితరులున్నారు.
సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీరారెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు బాలునాయకుతో కలిసి సిపిఐ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు
తెలిపింది. కరువు, ఫ్లోరైడ్ తో సతమతమవుతున్న దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు సాగు తాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం కోసం దశాబ్దాలుగా సిపిఐ పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు, పోరాటాలు,
పాదయాత్రలు నిర్వహించడం జరిగినది. ఫ్లోరైడ్ శాశ్వత పరిష్కారానికి సాగునీరు ఏకైక మార్గమన్నారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కెసిఆర్ 10 సంవత్సరాల కాలంలో దిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుండి
నీరు తీసుకోవాలని స్పష్టత లేకపోవడంతో ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతల పథకం మీద ప్రత్యేక. శ్రద్ధ
పెట్టినందుకు సిపిఐ పార్టీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.