అటకెక్కిన 1/70 చట్టం,
బినామీ నిర్మాణాలపై చర్యలు లేవా
అరకులోయ
The stuck 1/70 Act,
మండలంలోని పద్మాపురం పంచాయతీ పరిధిలో, ఇండియన్ గ్యాస్ కార్యాలయం సమీపంలో, ప్రభుత్వ వైన్ షాప్ ఎదురుగా, ప్రధాన రహదారి ఆనుకొని, ప్రభుత్వ అనుమతిలేని బినామీ బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయం నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ,రెవెన్యూ శాఖ అనుమతి లేకుండా దర్జాగా బినామీ వాణిజ్య సముదాయం నిర్మాణం నిర్మిస్తున్నారని స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పిసా కమిటీ తీర్మానం, పంచాయతీ అప్రూవల్, రెవిన్యూ ల్యాండ్ కన్వెన్షన్, బోరు బావి అనుమతి, ఇల్లు పన్ను చెల్లించకుండానే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ బినామీ వాణిజ్య సముదాయం నిర్మాణం చేపడుతున్నారని, పలువురు ఆరోపిస్తున్నారు, అక్రమ బినామీ వాణిజ్య సముదాయం నిర్మాణానికి పంచాయతీ ప్రభుత్వ అధికారులే అండ దండాలుగా వ్యవహరిస్తున్నారని, గిరిజన చట్టాలను తుంగలో తొక్కి అక్రమ బినామీ నిర్మాణాలకు పంచాయతీ అధికారులే ప్రోత్సహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు, ప్రభుత్వ అనుమతిలేని, బహుళ అంతస్తుల వాణిజ్యసముదాయంపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని, అల్లూరి జిల్లా రెవెన్యూ యంత్రాంగం చొరవ చూపి అక్రమ బినామీ వాణిజ్య సముదాయం నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని పలువురు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు, లేనియెడల జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పలువురు హెచ్చరిస్తున్నారు.



