- Advertisement -
శరవేగంగా సాగుతున్న సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులు
The Summer Action Plan is in full swing
హైదరాబాద్
రానున్న వేసవి కాలంలో పెరగనున్న డిమాండ్ కు తగ్గట్టు విద్యుత్ సరఫరా కోసం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ తగు చర్యలు చేపట్టింది. సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ వేసవి సన్నాహక చర్యల్లో భాగంగా జరుగుతున్న పనులను తనిఖీ చేసారు. మేడ్చల్ పరిధిలో బౌరంపేట్ లో నిర్మితవుతున్న 132 కేవీ సబ్ స్టేషన్ ను, టవర్ నిర్మాణ పనులు తనిఖీ చేసిన సీఎండీ, బౌరంపేట్ 33 / 11 కేవీ సబ్ స్టేషన్ లో అదనంగా ఏర్పాటు చేసిన 8 MVA పవర్ ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు.
హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలో 35 11 కేవీ ఫీడర్ల విభజన/ఇంటర్లింకింగ్, 149 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్ల స్థాయి పెంపు/ అదనంగా ఏర్పాటు, హబ్సి గూడ సర్కిల్ పరిధిలో 90 11 కేవీ ఫీడర్ల విభజన/ఇంటర్లింకింగ్, 14 33 కేవీ ఫీడర్ల విభజన/ఇంటర్లింకింగ్, 14 పవర్ ట్రాన్సఫార్మర్ల స్థాయి పెంపు/ అదనంగా ఏర్పాటు, 545 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్ల స్థాయి పెంపు/ అదనంగా ఏర్పాటు, సైబర్ సిటీ సర్కిల్ పరిధిలో 127 11 కేవీ ఫీడర్ల విభజన/ఇంటర్లింకింగ్, 4 33 కేవీ ఫీడర్ల విభజన/ఇంటర్లింకింగ్, 25 పవర్ ట్రాన్సఫార్మర్ల స్థాయి పెంపు/ అదనంగా ఏర్పాటు, 232 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్ల స్థాయి పెంపు/ అదనంగా ఏర్పాటు, సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో 49 11 కేవీ ఫీడర్ల విభజన/ఇంటర్లింకింగ్, 7 33 కేవీ ఫీడర్ల విభజన/ఇంటర్లింకింగ్, 23 పవర్ ట్రాన్సఫార్మర్ల స్థాయి పెంపు/ అదనంగా ఏర్పాటు, 309 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్ల స్థాయి పెంపు/ అదనంగా ఏర్పాటు, బంజారా హిల్స్ సర్కిల్ పరిధిలో 46 11 కేవీ ఫీడర్ల విభజన/ఇంటర్లింకింగ్, 73 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్ల స్థాయి పెంపు/ అదనంగా ఏర్పాటు, రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో 67 11 కేవీ ఫీడర్ల విభజన/ఇంటర్లింకింగ్, 9 33 కేవీ ఫీడర్ల విభజన/ఇంటర్లింకింగ్, 24 పవర్ ట్రాన్సఫార్మర్ల స్థాయి పెంపు/ అదనంగా ఏర్పాటు, 171 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్ల స్థాయి పెంపు/ అదనంగా ఏర్పాటు, హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో 18 11 కేవీ ఫీడర్ల విభజన/ఇంటర్లింకింగ్, 6 పవర్ ట్రాన్సఫార్మర్ల స్థాయి పెంపు/ అదనంగా ఏర్పాటు, 137 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్ల స్థాయి పెంపు/ అదనంగా ఏర్పాటు వంటి వివిధ పనులు చేపట్టారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ వినియోగం గతేడాది ఎండా కాలంతో పోల్చుకుంటే గణనీయంగా పెరుగుతున్నది. గతేడాది 3756 మెగావాట్లుగా నున్న గరిష్ట డిమాండ్ ఈ ఏడాది దాదాపు 16 % వృద్ధి తో 4352 మెగావాట్ల గా నమోదయ్యింది, గతేడాది 81.39 మిలియన్ యూనిట్లుగా నున్న వినియోగం దాదాపు 12 % వృద్ధితో 90.68 మిలియన్ యూనిట్లకు చేరింది. రాబోయే 2025 వేసవిలో సైతం విద్యుత్ డిమాండ్ గతం కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో గణనీయమైన వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేశారు. డిమాండ్ ఎంతగా పెరిగినా సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలనే ప్రభుత్వ ఆదేశాలనుసారం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, అధికారులు సిబ్బంది సెక్షన్ స్థాయిలో డిమాండ్ ను ముదింపు చేస్తూ తగు ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగ్నం అయి వున్నారు.
- Advertisement -