మెట్ పల్లి మునిసిపల్ లో స్వచ్చదనం పచ్చదనం
ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలి – రాణవేణి సుజాత
మెట్ పల్లి
The surroundings of the house should be kept clean
మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనము పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం మెట్ పల్లి పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాణవేణి సుజాత సత్య నారాయణ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వము స్వచ్ఛదనము పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా మంచిదని కొనియాడారు.ఇది ప్రజలు గ్రహించాలని మన ఇంటిని మనమే శుభ్రం చేసుకునే విధంగా, మన ఇంటి పరిసరాలలో ఆపరిశుభ్రమైన వస్తువులలో నీరు ఉన్న తొలగించాలని, ఇంటి పరిసరాల లో ఇంటిలో చెత్తాచెదారాలు లేకుండా తొలగించి,ప్రతి ఒక్కరు వారి వారి ఇంటి పరిసరాలను పరిశుభరాంగా ఉంచాలని పట్టణ ప్రజలని కోరారు. స్వచ్ఛదనము కార్యక్రమంలో అందరు పాల్గొని దోమల బెడద లేకుండా చేయాలని, దోమల ద్వారా డెంగు మలేరియా లాంటి విషపూరితమైన రోగాలు వస్తునాయని, అవి రాకుండా ఉండాలంటే దోమలు పెరగకుండా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని అన్నారు. దీనికి మనం స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమంలో మన ఇంటి పరీసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
పట్టణ ప్రజలకు వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నదని, వాటిని నివారించే మార్గాన్ని చేపడుతున్నామని తెలిపారు. అన్ని గృహాల నుండి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయమని మరియు కంపోస్ట్ ఉత్పత్తి చేయాలని, వీధులు మరియు బహిరంగ ప్రదేశంలో శుభ్రం ఉంచుకోవాలని ప్రతి ఇంటి వద్ద ఇంటింటికి ముక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించడం జరిగింది. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, వాటి బదులు కాటన్ సంచులను లేదా గోనె సంచులను వాడాలని అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి రానవేణి సుజాత సత్య నారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కమిషనర్ టి మోహన్, కౌన్సిలర్స్ భీమనాతి భవాని సత్యనారాయణ, ఓజ్జల బుచ్చిరెడ్డి, అంగడి పురుషోత్తం, డి ఈ టౌన్ ప్లాన్ ఆఫీసర్ , ఆర్ ఐ, హెల్త్ అసిస్టెంట్, మెప్మా టిఎంసి,, ఆర్ పి లు , అంగన్వాడీలు ఆశ వర్కర్లు, వార్డ్ ఆఫీసర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.