కేసిఆర్ ప్రభుత్వం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ హిందువులపై కక్ష కడుతుంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
గజ్వేల్ పట్టణంలో ఇటీవల జరిగిన మత ఘర్షణలను తెలంగాణ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించి శివాజీ విగ్రహాన్ని అవమానం పరిచిన వారిపై కేసులు పెట్టి శిక్షించకుండా ఆ వర్గాలకు కొమ్ము కాయడం సమంజసం కాదని ఈ సంఘటనపై బీజేపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఇటీవల జరిగిన మత ఘర్షణలలో జైలుకు వెళ్లిన హిందువులను పరామర్శించడానికి వచ్చిన క్రమంలో పట్టణంలోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జైలుకు వెళ్లిన గజ్వేల్ పట్టణ కౌన్సిలర్ గంగిశెట్టి రవి, బిజెపి నాయకుడు మనోహర్ యాదవ్ లను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి కిషన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లో హిందూ సమాజాం తలదించుకుని విధంగా,ఇటీవల పట్టణం లో శివాజీ విగ్రహాన్ని అవమాన పరచడం సమంజసం కాదని, బిజెపి పార్టీ తరపున ఖండిస్తున్నామని, ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారిని శింక్షించకుండా హిందువులను జైలు పంపించి మరో వర్గానికి కొమ్ము కాస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం హిందూ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని, పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి, పోలీసు బలగాలతో భయబ్రఅంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని రాష్ట్ర ప్రభుత్వం అక్రమ భూ కబ్జాలు, అక్రమ లిక్కర్ వ్యాపారాలు ప్రోత్సహించి, మహిళలను అవహేళన చేసిన ఏంతో మంది ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ నాయకులు ఉన్నారు. వారి పై కేసులు పెట్టడం లేదని, తెలంగాణా సమాజాన్ని అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్న నాయకులను తెలంగాణా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. నిజాం పరిపాలన విధంగా, నిజాం వారసులుగా తెలంగాణా ప్రభుత్వం వ్యవహరిస్తోంది, ఇది ఇలా ఉంటే తెలంగాణా ప్రజలు మీకు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ ఎస్ పార్టీలో ఉన్న అవినీతి నాయకులపై కేసులు పెట్టి, అమాయకులైన హిందువులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని గజ్వెల్ గడ్డ మీద నుండి సవాల్ చేస్తున్నానన్నారు.
బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ , బిజెపి రాష్ట్ర నాయకుడు కప్పర ప్రసాద్ రావు, ధరం గురువా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నలగమ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రాములు పట్టణ అధ్యక్షులు మధుసూధన్ గజ్వేల్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగింది.



