Tuesday, March 18, 2025

కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది

అదిలాబాద్, ఫిబ్రవరి 19, (వాయిస్ టుడే)

The time has come for the Congress government to go

కాంగ్రెస్ ప్రభుత్వ దాదాగిరి ఇంకో 5, 6 నెలలే అని, ఆ తరువాత తెలంగాణలో మీ ప్రభుత్వం ఉంటదో, ఊడతదో మీకే తెల్వదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా వ్యవహరించిన వాళ్ల సంగతి చూస్తామని ఘాటుు వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పాల్గొన్నారు.ఫిబ్రవరి 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉద్యోగులు, పట్టభద్రులు, టీచర్లంతా ఎదురు చూస్తున్నారు. ఏ సర్వే చూసినా 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం, భరోసా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా బీజేపీ పోరాటాన్ని చూసిన, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అరాచకాలను చూసి ప్రజలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం రూ.12.75 లక్షల ట్యాక్స్ రీబేట్ మినహాయింపు ఇచ్చింది. 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు కేటాయించి తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. కేంద్రంపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ కు నేను సవాల్ చేస్తున్నా… కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? ఇది రెఫరెండంగా తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నిలకు రావాలని కాంగ్రెస్ కు సవాల్ చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్ధి పరిస్థితి గందరగోళంగా మారింది. ఆయనకు ఏజెంట్లు లేరు. ప్రచారం చేసే నాయకులు లేరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయనకు గెలిపించాలనే ఆలోచనే లేదు. చివరకు ఆయన సొంత కాలేజీ స్టాఫ్ ను పట్టుకుని తిరుగుతున్నడు. ఆయన గెలిస్తే ఉన్న ఉద్యోగాలు పోతాయోమోననే సొంత స్టాఫ్ భావిస్తోంది. మంచిర్యాలలో కొంత మంది దాదాగిరి చేస్తున్నరు. మహా అంటే 6 నెలలకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదు. అవినీతిని రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. సీఎం వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. కమీషన్లకు కక్కుర్తి పడుతున్నరు. ఉద్యోగుల పీఆర్సీని అమలు చేయరు. డీఏలు ఇవ్వాలని అడిగితే పైసల్లేవంటున్నరు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్, గ్రాట్యుటీ పైసలు కూడా ఇయ్యకుండా సతాయిస్తున్నరు. ఆ డబ్బుల కోసం సచివాలయం చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగే దుస్తితి ఏర్పడింది. కానీ 15 శాతం కమీషన్లు ఇస్తే మాత్రం కాంట్రాక్టర్లకు అప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉంది. 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడింది, లాఠీదెబ్బలు తిన్నది, రక్తం చిందించింది, జైలుకు పోయింది మేం. ఆనాడు నా ఆఫీస్ లో నేను దీక్ష చేస్తుంటే… జేసీబీతో కూల్చి నన్ను అరెస్ట్ చేసి లోపలేయాలని పోలీసులను ఆదేశించిండు.. ఆనాడు మీరెటు పోయారు? పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, డీటీఎఫ్ సహా ఏ ఒక్క సంఘమైనా బీజేపీకి అండగా నిలిచారా? టీచర్లకు మద్దతుగా పోరాడారా? ఆనాడు రేవంత్ రెడ్డిసహా ఎవరైనా మీ పక్షాన పోరాడారా? మీకోసం పోరాడింది బీజేపీ’ అని బండి సంజయ్ అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్