ఏపి కాంగ్రెస్ లో ముదురుతున్న వార్
విజయవాడ
ఏపీ కాంగ్రెస్ లో వార్ ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుంకర పద్మ శ్రీ, రాకేష్ రెడ్డిలకు క్రమశిక్షణ కమిటీ నోటిసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. షర్మిలా, మాణిక్యం ఠాకూర్ అవినీతికి పాల్పాడారని పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఆరోపణలు చేసారు. వాళ్ళు చేసిన ఆరోపణలపై 7రోజుల్లో వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. చివరకు నోటిసులకు పద్మశ్రీ, రాకేష్ రెడ్డి సమాధానం ఇచ్చారు. 20వ తేదీన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు షర్మిళ ప్రకటించారని రీప్లే లో పద్మ శ్రీ, రాకేష్ రెడ్డి పేర్కోన్నారు. అన్ని కమిటీలు రద్దు చేసినప్పుడు క్రమ శిక్షణ కమిటీ కూడా రద్దు అవుతుందని పేర్కోన్నారు. నోటీసులో పేర్కొన్న విధంగా వివరణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్న ఎవరికి ఇవ్వాలో అయోమయంలో ఉన్నామని పేర్కొన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానాలు ఇవ్వాలని కోరారు.
ఏపి కాంగ్రెస్ లో ముదురుతున్న వార్
- Advertisement -
- Advertisement -