దామచర్ల చక్రం తిప్పేశారు
The wheel of damacharla turned
ఒంగోలు, ఆగస్టు 16
ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. 2019 నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో చక్రం తిప్పితే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంగోలు పాలిటిక్స్ మెత్తం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఒంటిచేతితో నడిపిస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌ని వైసీపీ సొంతం చెసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వైసిపి కార్పొరేటర్లు పసుపు కండువ కప్పుకోవడానికి క్యూ కడుతున్నారుఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున ఆరుగురు, జనసేన నుంచి ఒకరు గెలుపొందారు. ఇద్దరు స్వతంత్ర్య అభ్యర్ధులు విజయం సాధించారు. మిగిలిన 41 డివిజన్లలో వైసీపీ పాగా వేసింది.. అప్పట్లో స్వతంత్రంగా గెలిచిన ఇద్దరు కార్పొరేటర్లు వైసీపీలో చేరారు. దీంతో కార్పొరేషన్లో వైసీపీ బలం 43కి చేరింది. అయితే ఎన్నికలకు ముందే అయిదుగురు అధికారపక్షం కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ వారు కూటమిలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్న కార్పొరేషన్లో ఇప్పుడు కూటమి బలం 12కు చేరింది … మరో 14 మందిని చేర్చుకుంటే మేయర్ పదవి టీడీపీ వశం అవుతుంది. అయితే వైసీపీని కోలుకోకుండా దెబ్బ కొట్టాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పావులు కదుపుతూ వచ్చారు. కనీసం మరో 20 కార్పొరేటర్లను లాక్కుంటే కౌన్సిల్‌లో ఎదురుండదని దామచర్ల స్కెచ్ గీశారు. ఆ క్రమంలో తాజాగా మేయర్ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే దామచర్ల సమక్షంలో పసుపు కండువాలు కప్పుకుని టీడీపీలో చేరిపోయారు.ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని ఓడిపోవడం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో అప్పటి నుంచే మేయర్ సుజాత టీడీపీతో టచ్‌లోకి వచ్చారన్న ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే దామచర్లతో మంతనాలు సాగించిన ఆమె.. ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చారు. ఇప్పుడు కూటమి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నెల్ రావడంతో దామచర్ల ఆమెతో పాటు కార్పొరేటర్లను పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక సందర్భంగా మేయర్ అందరిలాగే అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని స్టేట్ మెంట్ ఇచ్చేశారు.ఇప్పటికే పలు సార్లు మేయర్ సుజాత ఎమ్మెల్యే దామచర్ల జనర్ధన్‌తో టీడీపీలో చేరికపై చర్చించారు. అయితే దామచర్ల మెదట కార్పొరేటర్లను జాయిన్ చేసుకుని తర్వాత మేయర్‌ను చేర్చుకుంటామన చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆమెను మేయర్‌గా కొనసాగించేందుకు టీడీపీ నేతలు సుముఖంగా లేరని అందుకే ముందుగా కార్పొరేటర్లను చేర్చుకుని మెజార్టీ సాధిస్తే.. ఆమెను మేయర్ పీఠం నుంచి దించి. పార్టీ వారికి ఆ పదవి కట్టబెట్టు కోవచ్చని భావించారంట. తీరా చూస్తే మున్సిపల్ చట్టం ఉన్న లొసుగులు సుజాతను పదవి నుంచి దించడానికి సహకరించకపోవడంతో.. దామచర్ల ఆమెను పార్టీలో సాదరంగా ఆహ్వానించారంటున్నారు.వాస్తవాని




