ఒకేసారి ఇద్దరికి తాళీ కట్టిన యువకుడు
కొమురం భీమ్
The young man who locked two people at once
ఒకే పెళ్లి మండపంలో ఒకేసారి ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టాడు ఓ యువకుడు. అంతేకాదు, శుభలేఖలోనూ ఆ ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంటున్నట్లు అచ్చు వేయించాడు. 500 మంది అతిథుల సమక్షంలో ఆ ఇద్దరి మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత ఆ జంటను.. సారీ, .. ముగ్గురు కదా, జంట అనలేం.. ఆ భర్తా భార్యలను అతిథులందరూ ఆశీర్వదించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లి ఫోటోలు, శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ యువకుడు ఇద్దరు యువతులతోనూ ప్రేమలో పడటం.. ఆ విషయం తెలిసినా వారు ముగ్గురూ కలిసి జీవించడానికి నిర్ణయించుకోవడంతో ఈ వింత పెళ్లి జరిగింది. అలాగని ఆ యువకుడు ఏ కోటీశ్వరుడో, లక్షాధికారి కుమారుడో అనుకునేరూ.. ఒక సాధారణ రైతు కుటుంబం అతనిది…