- Advertisement -
తాడేపల్లిగూడెంలో చోరీ
Theft in Tadepalligudemతాడేపల్లిగూడెం,
తాడేపల్లిగూడెంలో2వ వార్డులో గాయత్రి గుడి సమీపంలో ఓ ఇంట్లో దొంగలు పడి పదికాసుల బంగారం 30 తులాల వెండి 30 వేలు నగదు దోచుకుపోయారు. దీనికి సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాయత్రి గుడి సమీపంలో నివాసం ఉంటున్న గోపి విజయలక్ష్మి ఆదివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి తన కుమారుడి ఇంటికి వెళ్లి తిరిగి సోమవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం గమనించారు. దీంతో వెంటనే ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువా తాళాలు తెరిచి చూసేసరికి ఇంట్లోని బంగారం వెండి నగదు అపహరించినట్టు గుర్తించారు. వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
- Advertisement -




