Thursday, January 16, 2025

దొంగతనం అంత ఈజీనా…

- Advertisement -

దొంగతనం అంత ఈజీనా…

Theft is so easy...

కాకినాడ, డిసెంబర్ 19, (వాయిస్ టుడే)
సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలి అని వీడియోలు చూశాడో.. లేకపోతే దొంగతనం కేంద్రంసాగే మనీ హెయిస్ట్ లాంటి వెబ్ సిరీస్‌లు చూశాడో కానీ ఓ వ్యక్తి ఏకంగా ఓ కార్పొరేట్ గోల్డ్ షోరూంనే టార్గెట్ చేశాడు. కానీ ప్రాపర్ గా వర్కవుట్ చేయకపోవడం.. దోచుకున్న వరకే ప్లాన్ రెడీ చేసుకోవడం.. ఆ ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియకపోవడంతో దొరికిపోయాడు. అది కూడా మామూలు పోలీసులకు కాదు.. ట్రాఫిక్ పోలీసులకు. కాకినాడ మెయిన్ రోడ్‌లో తనిష్క్ బంగారు ఆభరణాల షోరూం ఉంది. మధ్యాహ్నం సమయంలో కస్టమర్లు ఎవరూ  లేరు. ఆ సమయలో ఓ యువకుడు వచ్చాడు. తనకు లావుపాటి గోల్డ్ చైన్ కావాలని చూపించమని అడిగాడు. సేల్స్ గర్ల్ ఆరేడు మోడల్స్ చూపించింది. అన్నింటిని తన చేతుల్లోకి తీసుకున్న ఆ వ్యక్తి వెంటనే జేబులో నుంచి తుపాకీ తీసి.. కదిలితే కాల్చేస్తానని హెచ్చరించాడు.దాంతో వచ్చిన వాడు దొంగ అని తెలిసి ఆ సేల్స్ గర్ల్ వణికిపోయింది. తర్వాత అతను ఆ నగలు తీసుకుని పరారయ్యాడు. చేతిలోతుపాకీ కూడా ఉండటంతో సెక్యూరిటీ కూడా ఆపలేదు. ఆ దొంగ అలా రోడ్డు మీదకు పరుగులు పెట్టిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే సిటీ బయటకు అనుమానాస్పద వ్యక్తులు వెళ్లకుండా తనిఖీలు చేయమని ఆదేశాలిచ్చి షోరూంను పరిశీలించేందుకు వచ్చారు. అయితే కాసేపటికే ఫారెస్ట్ ఆపీసు దగ్గర ఓ యువకుడ్ని పోలీసులు పట్టుకున్నారని అతని వద్ద చాలా బంగారు ఆభరణాలు ఉన్నాయని కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చింది. వెంటనే వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి తుపాకీ చూపించి గోల్డ్ కొట్టేసి బయటకు వచ్చాడు కానీ.. ఎటు పోవాలో అర్థం కాలేదు. ఫారెస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూండటంతో ఏమైందని ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రశ్నించాడు. అప్పటికే దొంగతనం చేశానన్న ఆందోళనతో.. ్ందరూ తననే వెంటాడుతున్నారన్న భయంతో వణికిపోతున్న ఆ యువకుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. తేడాగా ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని పట్టుకున్నాడు. అతని జేబుల్లో వెదికితే బంగారం లభించింది. వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న గన్ స్వాధీనం చేసుకున్నారు. అది నిజమైన గన్ కాదని..  టాయ్ గన్ అని తేలింది. ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతను ప్రొఫెషనల్ దొంగ కాదని..  అలా అయితే.. పకడ్బందీగా దోపిడీ చేసి పారిపోయేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుని ఉండేవాడని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్