- Advertisement -
మహేశ్వరంలో కరెంట్ కొరత లేకుండా చూడాలి
Their should not be current shortage to Maheshwaram
విద్యుత్ అధికారులతో కేఎల్ఆర్ చర్చ
మహేశ్వరం
మహేశ్వరం నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా చూడాలని అధికారులను మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు. తుక్కుగూడ కేఎల్ఆర్ కార్యాలయంలో ఎస్ఈ, డీఈ, ఏడీ సహా ఏఈలు దపూర్వకంగా లక్ష్మారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కిచ్చెన్న మాట్లాడుతూ…. ట్రాన్స్ఫర్మర్ల కొరత, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. అవసరమైన కరెంటు సామగ్రి కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తానని కేఎల్ఆర్ హామీ ఇచ్చారు. భవిష్యత్ (20 ఏళ్ల పాటు) విద్యుత్ అవసరాలకు దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా ఏర్పట్లు చేసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులతోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -