పార్టీ మారే ప్రసక్తే లేదు

- Advertisement -

బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

హైదరాబాద్: మీడియా లో  తాను కాంగ్రెస్ పార్టీ లో చేరుతునట్లు వస్తున్న వార్తలను  తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ లో  చేరే ప్రసక్తి లేదని, కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారు. బిజెపి జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చింది. మోడీ  నాయకత్వంలో పని చేయడానికి అదృష్టం ఉండాలి. కనీసం తన స్పందన తీసుకోకుండా వార్త కథనాలు రాయడం సరైంది కాదు .  తన రాజకీయ భవిష్యత్ నిర్ణయించాల్సిన హక్కు మీడియాకు ఎవరు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు.   తన పై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థల పై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular