అన్న క్యాంటీన్ లో పవన్ కళ్యాణ్ ఫోటో లేదు
There is no photo of Pawan Kalyan in the canteen
పిఠాపురం
అన్న క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ చిత్రపటం లేకపోవడంతో జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేసారు. జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ మాట్లాడుతూ ఆగస్ట్ 15 తారీఖున అన్న క్యాంటీన్ లు మళ్ళీ ప్రారంభం కావడం నియోజకవర్గం ఆనందించదగిన విషయం. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చిత్రపటం అన్న క్యాంటీన్లో లేకపోవడం చాలా బాధాకరం ఉంది. నియోజకవర్గం లో కార్యకర్తలు అభిమానులు దీనిపై చాలా విచారణ వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నాలుగు రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేసాం. రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మున్సిపల్ కమిషనర్ దీనిపై పునరాలోచన చేసి పవన్ కళ్యాణ్ చిత్రపటం అన్న క్యాంటీన్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.