Monday, July 14, 2025

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏసీబీ విచారణకు హజరయిన కేటీఆర్

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
ఏసీబీ విచారణకు హజరయిన కేటీఆర్
హైదరాబాద్

There is no question of leaving the Congress government: KTR appears before ACB inquiry

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం నాడు ఏసీబీ విచారణకు హజరయ్యారు. అంతకుముందు అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. చట్టం  మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పాము. ఇది మూడోసారి విచారణకు పిలవటం. మూడుసార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తాం. విచారణకు సహకరిస్తామని అన్నారు.
మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినంతమాత్రాన ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రశ్నించకుండా ఉంటారనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకం మాత్రమే,. కెసిఆర్ హరీష్ రావులను కాలేశ్వరం కమిషన్ల ముందు కూర్చోబెట్టారు. వారిని  కమిషన్ ముందు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు . నన్ను ఏసీబీ విచారణకు మళ్లీ మళ్లీ పిలుస్తున్నారు. నన్ను మళ్లీ ఏసీబీ విచారణకు పిలిచి రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు.
అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు కేసులు కొత్త కాదు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్లొచ్చాను. ఫార్ములా ఈ రేసులో తెలంగాణ ను ప్రపంచంలో నెంబర్ వన్ చేశాం. మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరేవరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదని అన్నారు. ఒక్కసారి కాదు వందసార్లు అయినా జైలుకు పోతామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఇచ్చిన 420 హామీలు దొంగ ఆరు గ్యారెంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవ్వాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తోందని సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ రెడ్డి తీరును గమనిస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి ఇప్పుడు వాటిని విస్మరించి స్థానిక సంస్థలకు వెళ్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీటిని బీసీ ప్రజలు గమనిస్తున్నారు. రైతుబంధును ఎలక్షన్ బందుగా మార్చి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రైతుబంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని రాష్ట్ర మహిళలు గమనిస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నువ్వు చేసిన మోసాన్ని నిరుద్యోగులు యువత గమనిస్తున్నారు. మీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడని అన్నారు.
ఏదో ఒక కమిషన్ ఎంక్వయిరీ అంటూ కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్ బిజెపి దొంగనాటకాలు దొంగ బాగోతం అంతా తెలంగాణ ప్రజలకు అంతా అర్థమయింది. ఒక కేసు కాదు ఇంకా వెయ్యి కేసులు పెట్టిన మీ ప్రశ్నిస్తూనే ఉంటాం నువ్వు లై డిటెక్టర్ కు సిద్ధం కావాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్