Monday, January 6, 2025

ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనే మాటే రాదు

- Advertisement -
There is no question of not contesting the election
There is no question of not contesting the election

మంత్రిగా ప్రమాణం చేసినా.. తగ్గినట్టు కాదు

హైదరాబాద్, ఆగస్టు 24:  తాండూరు మాజీ ఎమ్మెల్యే , మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహేందర్ రెడ్డి బీఆర్ఎస్‌కు షాకిచ్చే కామెంట్లు చేశారు. మంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించినంత మాత్రాన తాను మెత్తబడినట్లు కాదని .. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై  పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానని మీడియాతో వ్యాఖ్యనించారు. గత ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మహేందర్ రెడ్డి.. స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే తర్వాత రోహిత్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. సిట్టింగ్‌లు అందిరికీ టిక్కెట్లు ఇవ్వాలనుకున్న కేసీఆర్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ అదే చాన్స్ ఇచ్చారు. దీతో మహేందర్ రెడ్డి పార్టీ మారిపోతారన్న ప్రచారం ఊపందుకుంది. కానీ అనూహ్యంగా ఆయనకు కేసీఆర్ కేబినట్ లో చోటు కల్పిస్తున్నారు. మహేందర్ రెడ్డి పార్టీ మారకుండా.. బుజ్జగించేందుకు కేసీఆర్ మంత్రి పదవి ఆఫర్ చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆ ప్లేస్‌లో ఎవర్నీ తీసుకోలేదు. ఈటల నిర్వహించన శాఖలన్నీ మంత్రి హరీష్ రావుకు ఇచ్చారు. అయితే ఎన్నికలకు ముందు.. మహేందర్ రెడ్డిని మంత్రి పదవిలోకి తీసుకోవడానికి కేవలం.. అసంతృప్తి చెంది  పార్టీ వీడి పోకుండా ఉండటానికేనని భావిస్తున్నారు. మహేందర్ రెడ్డి  మాస్ లీడర్. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనేది ఆయన అనుచరులు ఊహించలేరు. మహేందర్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. తాను ముఫ్ఫై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనే మాటే రాదని చెబుతున్నారు. మహేందర్ రెడ్డి మొదట టీడీపీలో ఉండేవారు. రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమ రాజకీయాలతో బీఆర్ఎస్‌లో చేరారు. ఏ పార్టీలో ఉన్నా.. ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఖాయమన్నట్లుగా ఆయన బలమైన నేతగా ఉండేవారు. గత ఎన్నికల్లో తాండూరులో  స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయన సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేసి రేవంత్ రెడ్డిపై గెలిచారు. అయితే మహేందర్ రెడ్డి ఓడిపోవడంతో మంత్రి పదవి కూడా రాలేదు. తర్వాత కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. రోహిత్ రెడ్డి పార్టీలో చేరడంతో ఆయనకు బీఆర్ెస్ తరపున టిక్కెట్ దొరకడం కష్టమైంది. ఆయన వస్తానంటే.. బీజేపీ, కాంగ్రెస్ మంచి ప్రాధాన్యత ఇచ్చి చేర్చుకుంటాయనడంతో సందేహం లేదు. ఎందుకంటే..  ఆయన పార్టీ మారితే.. ఆయన సోదరుడు నరేందర్ రెడ్డి కూడా మారాల్సి వస్తుంది. అది కొడంగల్ సీటు పై ప్రభావం చూపుతుంది. మహేందర్ రెడ్డి మంత్రి  ఎన్నికల సమయంలో..  ఖచ్చితంగా ఏదో ఓ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన మాటల్ని బట్టి స్పష్టమవుతోంది. మెత్తబడినట్లు కాదని ఎన్నికల్లో పోటీ చేయడంపై నిర్ణయం తీసుకుంటానని చెబుతూండటంతో.. ఆయన  ఎన్నికల నాటికి ఏ పార్టీలో ఉంటారోనన్న ప్రారంభమయింది. చివరి దశలో మంత్రి పదవి ఇచ్చి కేసీఆర్ రిస్క్ తీసుకుంటున్నారేమోనన్న అభిప్రాయం బీఆర్ఎస్‌లో వినిపిస్తోంది.  

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్