మధు యాష్కి
హైదరాబాద్: తెలంగాణ బిల్లు సమయంలో కాంగ్రెస్ ఎంపీ ల పాత్ర అత్యంత కీలకం. మా రాజకీయ భవిష్యత్ గురించి మేము ఆలోచించలేదు.. రాష్ట్రం ఏర్పడితే చాలు అనుకున్నామని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కి అన్నారు.
కానీ ప్రవల్లిక లాంటి వారు ఆత్మహత్యలకు పాల్పడుతుంటె మాకు భాధేస్తుంది. సూసైడ్ నోట్ లో ప్రేమ వ్యవహారం లేదు. కేటీఆర్ విర్రవీగి మాట్లాడుతున్నారు. ప్రవల్లిక ఆత్మహత్య గురించి కవిత ఎందుకు మాట్లాడడం లేదు. ఓక ఆడబిడ్డ పై అబండాలు వేసారు. బీఆర్ఎస్ ఆదేశాలతో డీసీపీ ఆడబిడ్డ పై అభాండాలు వేసారు. మ్యానిఫెస్టో తో కేసీఆర్ మరోసారి చెవి లో పువ్వులు పెట్టారు. 2014,18 లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు.. ఇప్పుడు కొత్త హామీలు ఇవ్వడం మరోసారి మోసం చేయడమే. కాంగ్రెస్ గ్యారంటీ లతో కేసీఆర్ కు వణుకు వచ్చింది. మా గ్యారెంటీ స్కీం లకు డబ్బులు ఎలా అని ప్రశ్నించిన కేటీఆర్.. ఇప్పుడు మీ బడ్జెట్ గురించి ఎందుకు చెప్పడం లేదని అన్నారు.
రాహుల్, ప్రియాంక గాంధీ ల బస్సు యాత్ర సక్సెస్ పై చర్చించాం. టిక్కెట్ ల విషయం లో మాకు ఎలాంటి ఆందోళన లేదు. కేటీఆర్ సంస్కార హీనుడు.కొన్ని సార్లు ఆశించిన వారికి టిక్కెట్ లు రాకపోవచ్చు. పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. ఫస్ట్ లీస్ట్ ,సెకండ్ లీస్ట్ అనేది ఉండదు. ఏ లీస్ట్ వచ్చినా..అభ్యర్దే నని అన్నారు. ..


