మరిన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ మార్పులు ఉండొచ్చని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంకేతాలు ఇచ్చారు.
‘పార్టీ బలోపేతం, గెలుపు కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం.
ఇంకా మార్పులు ఉండొచ్చు. ఉండకపోవచ్చు.
ఎన్ని స్థానాల్లో మార్పులు ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేం.
అవసరాన్ని బట్టి మార్పులు ఉంటాయి. అందరికీ నచ్చజెప్తున్నాం.
ఎందుకు మార్పు చేస్తున్నామో వివరిస్తున్నాం’ అని సజ్జల పేర్కొన్నారు.
: పార్టీ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం: బొత్స
11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ల మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
‘175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం.
11 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.
పార్టీలో అందరికీ న్యాయం చేస్తాం.
వీరంతా పార్టీ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని.. సహకరిస్తారని భావిస్తున్నాం.
తల్లిలాంటి పార్టీని నిలబెడతారని ఆశిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.



