- Advertisement -
కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జగిత్యాల రహదారిలోని సుభాష్‌నగర్‌లో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు పూరిళ్లు వేసుకుని నివాసముంటున్నారు. ఈ ప్రాంతంలో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5 గ్యాస్ సిలిండర్లు పేలాయి. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. పూరిళ్లలోని కార్మిక కుటుంబాలు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -