- Advertisement -
దుబ్బాకలో మంత్రి కొండా సురేఖ కార్యక్రమంలో రచ్చ రచ్చ
There was a lot of commotion at the Minister Konda Surekha program in Dubbaka
సిద్దిపేట
దుబ్బాకలో జరిగిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు హజరయ్యారు. మంత్రితో పాటు కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్టేజిపైకి వెళ్లడంతో వివాదం మొదలమయింది. స్టేజీపైకి ఓడిపోయిన వారు రావద్దని, ప్రోటోకాల్ పాటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు పట్టు పట్టారు. ఖచ్చితంగా స్టేజీ పైనే శ్రీనివాస్ రెడ్డి ఉంటాడని కాంగ్రెస్ నేతల ఆందోళనకు దిగారు. మూడు పార్టీల కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు…తోపులాట జరిగింది. పోలీసులు కార్యకర్తలను నిలువరించేందుకు తంటాలు పడ్డారు. చివరకు చెరకు శ్రీనివాస్ రెడ్డి స్టేజినుంచి కిందికి దిగిపోయారు. రసాభాస మధ్య మంత్రి కొండా సురేఖ చెక్కులు పంపిణీ చేసారు.
- Advertisement -