రాంచరణ్ పిల్లల పేర్లు ఇవే
హైదరాబాద్, ఫిబ్రవరి 13, (వాయిస్ టుడే )
These are the names of Ram Charan’s children.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కొణిదెల దంపతులు ఇటీవల పండంటి కవలలకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 31న ఉపాసన మగ బిడ్డ, ఆడ బిడ్డలకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివెరిసింది. ఇక ఈ శుభవార్త విన్న తర్వాత అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని అపోలోహాస్పిటల్ వద్దకు వేలాది సంఖ్యలో వచ్చి రామ్ చరణ్- ఉపసాన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఉపాసన తన కవల పిల్లలను ఇంటికి తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు సంప్రదాయంగా నామకరణ మహోత్సవం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. పండితుల సూచలు, సలహాలతో కేవలం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్- ఉపాసనల కవల పిల్లల పేర్లను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.పిల్లల జాతకం, జన్మనక్షత్రాల ప్రకారం కూతురికి అన్వీరా దేవీ, కుమారుడికి శివరామ్ అని పేర్లు పెట్టినట్లు తెలుస్తుంది. అన్వీరా దేవి అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అని వస్తోంది. అలాగే చిరంజీవి అసలు పేరు లోని శివ, రామ్ చరణ్ పేరులోని రామ్ ను తీసుకుని కుమారుడికి శివ రామ్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం మెగాభిమానులు ఈ పోస్టులను తెగ షేర్ చేస్తున్నారు.



