హైదరాబాద్, నవంబర్ 21, (వాయిస్ టుడే): తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 49 లెక్కింపు కేంద్రాలను ఎంపిక చేసింది. ఇప్పటికే పనులు స్టార్ట్ చేసింది ఈసీ.హైదరాబాద్ మహానగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
49 ఓట్ల లెక్కింపు కేంద్రాల వివరాలు
ముషీరాబాద్ – ఏవీ కళాశాల, దోమల్ గూడ.
మలక్‌పేట – ఇండోర్ స్టేడియం, అంబర్ పేట, రెడ్డి ఉమెన్స్ కళాశాల, నారాయణగూడ,
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ – కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసుఫ్ గూడ.
సనత్ నగర్ – కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఓయూ క్యాంపస్.
నాంపల్లి – జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్, మాసబ్ ట్యాంక్.
కార్వాన్ – ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్.
గోషామహల్ – తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి.
చార్మినార్ – కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, నాంపల్లి.
చాంద్రాయణగుట్ట – నిజాం కళాశాల, బషీర్ బాగ్.
యాకత్ పురా – సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయ, నాంపల్లి.
బహదూర్ పురా – అరోరా కళాశాల, బండ్లగూడ.
సికింద్రాబాద్ – డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్, ఓయూ.
కంటోన్మెంట్ – వెస్లీ కళాశాల, సికింద్రాబాద్.
రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపు: ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల ఎక్కింపు సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఎల్బీనగర్ నియోజకవర్గ లెక్కింపు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్ నియోజకవర్గాల కౌటింగ్ లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు సంబంధించి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలిలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.ఇక తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, డిసెంబర్ 3వ తేదీన కౌటింగ్ చేపట్టేందుకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.