చేతకాక జగన్ పై ఆరో్పణలు చేస్తున్నారు

- Advertisement -

చేతకాక జగన్ పై ఆరో్పణలు చేస్తున్నారు

They are making accusations against Jagan

సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు, పవన్ డక్ ఔట్
పోతిన మహేష్ , వైస్సార్సీపీ నేత
విజయవాడ
సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చేతులెత్తేశారు. ఇది ప్రజలను మోసం చేయడం కదా అని చంద్రబాబు , పవన్ చెప్పాలని వైకాపా నేత పోతిన మహేష్ నిలదీసారు. సూపర్ సిక్స్ అమలు చేయించే బాధ్యత నాదని పవన్ చెప్పాడు.. ఇప్పుడు పవన్ స్వందించాలి. చంద్రబాబు పాలన సంక్షేమ పధకాల కోత.. పన్నుల మోత గా ఉందని అన్నారు.
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు చేపడుతున్నాడు. హెల్మెట్ లేకపోతే వెయ్యి నూట ముప్పై ఐదు రూపాయలు కట్టించుకొంటున్నారు. విద్యుత్ చార్జీల పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, చాలనాలు వసూళ్లు చేయడం సంపద సృష్టించడం అంటారా ? జగన్ దగ్గర చంద్రబాబు , పవన్ ట్యూషన్ చెప్పించుకోవాలి.
జగన్ సంక్షేమ పథకాల అమలులో సెంచరీ కొడితే… పవన్,  చంద్రబాబు డక్ ఔట్ అయ్యారు. బీజేపీ చంద్రబాబు పవన్ పట్టుకున్న మ్యానిఫెస్టో పట్టుకోలేదు. ప్రజలు చంద్రబాబు, పవన్ మాయలో పడ్డారు. దావోస్ లో చంద్రబాబు ని చూసి పారిశ్రామిక వ్యక్తలు పారిపోయారు..ఒక్క ఎంఓయూ  కూడా చేసుకోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష 78వేల కోట్లు ఎంఓయూ లు చేసుకొని పండగ చేసుకుంటున్నారు. 40ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ని చూసి పారిశ్రామిక వేత్తలు ఎందుకు రాలేదు. పవన్ దావోస్ పెట్టుబడులపై మాట్లాడాలి.. ఇది ప్రభుత్వ వైఫల్యం కదా అని ప్రశ్నించారు.
కర్నూల్ గ్రీన్ కో అత్భుతంగా వుందని చెప్పిన కంపెనీ జగన్ హయాంలో వొచ్చింది. దావోస్ పర్యటన తరువాత చంద్రబాబు నాలిక మదటపడుతుంది. వినేవాళ్ళు ఉంటే చంద్రబాబు చార్మినార్ కట్టారని చెపుతారు. హైదరాబాద్ లో ఓఆర్ఆర్  కట్టింది రాజశేఖర్ రెడ్డి, శంషాబాద్ లో విమానాశ్రయం కట్టని రాజశేఖర్ రెడ్డి, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొని వొచ్చింది రాజశేఖర్ రెడ్డి. 2014 నుండి 2019 వరకు టీడీపీ ఒక్క పని కూడా చేయలేదు.. ఒక్క శాశ్వత నిర్ణయం కూడా చెప్పట్టలేదు. అమరావతి కి ఔటర్ రింగ్ రోడ్ కట్టింది.. విజయవాడ వెస్ట్ బైపాస్ కట్టింది జగన్.. అమరావాతి లో తిరుపతి తరహా గుడి కట్టింది జగన్ హయాంలోనే. సింగపూర్ కంపెనీ కి అమరావతి నిర్ణయం గురించి మాట్లాడారు.. మంత్రి.అరెస్ట్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతుందా? అమరావతి లో రిజిస్ట్రేషన్ చార్జీలు లేవని చంద్రబాబు చెపుతున్నారు..పేద మధ్యతరగతి వాళ్ళు సేంట్ భూమి కొనగలరా? పేదలు కొనే దగ్గర రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి.. పెట్టుబడి దారులు కొనే దగ్గర చార్జీలు తగ్గుతాయి. పేదల ఇంట్లో , మహిళల కళ్లల్లో వెలుగులు జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. చంద్రబాబు చెప్పినట్లు కేంద్రం నిధులు దారి మళ్ళితే పోలవరం పని పూర్తి అవుతుందా? ఏ పని చేయలేక.. ఏ పని చేతకాక  గుడ్డ కాల్చి జగన్ పై వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడని ఆరోపించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular