యధేచ్చగా ఇసుకను తవ్వేస్తున్నారు పట్టించుకోని రెవిన్యూ అధికారులు

- Advertisement -

యధేచ్చగా ఇసుకను తవ్వేస్తున్నారు

పట్టించుకోని రెవిన్యూ అధికారులు

They are mining sand freely.

ములుగు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీరు పేద కుటుంబాలకు ఇండ్ల కోసం వాగులోనుండి ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా రైతులకు మిర్చి కల్లాలకు గాని, నూతన ఇండ్లకు తోలుకోవచ్చని ఆదేశించింది. కొంతమంది దీనిని ఆసరాగా చేసుకుని యూనియన్ పేరుతో ఇష్టారాజ్యంగా పగలు రాత్రి అనే తేడా లేకుండా హనుమంతు వాగును తవ్వేస్తున్నారు.జిల్లాలోని కన్నాయిగూడెం మండలం బుట్టయిగూడెం గ్రామంలో కొద్దిరోజుల క్రితం ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్ల యూనియన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. యూనియన్ ఉంటే ఇసుక పుష్కలంగా తవ్వుకోవచ్చని, అంతేకాకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా ఎవరైనా ప్రశ్నిస్తే మాకు యూనియన్ ఉందని అధ్యక్షుడు పేరు చెప్పి, విచ్చలవిడిగా రవాణా చేసుకోవచ్చనే దిశగా అక్రమార్కులు ఆలోచిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సపోర్ట్ దండిగా ఉండడంతో రెచ్చిపోతున్న ఇసుక అక్రమార్కులు ఒక్క ఇసుక లోడ్ ట్రాక్టర్ కు 1200 రూపాయలు తీసుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రెవిన్యూ అధికారుల కళ్ళముందే ఇంత జరుగుతున్న  వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ ఇసుక రవాణా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular