మాభూమి ఆక్రమించి చంపుతామని బెదిరిస్తున్నారు

- Advertisement -

మాభూమి ఆక్రమించి చంపుతామని బెదిరిస్తున్నారు

They are threatening to kill Mabhumi

కలెక్టర్, ఎస్పిలకు బాధితుల మొర
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్పందించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

బాపట్ల: :
-మా భూమిని ఆక్రమించి మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తూ దాడి చేసి కొట్టడమే కాకుండా చంపుతామని బెదిరిస్తున్నారని చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన పరిశా మురళీ ప్రసాద్, పరిశా రాధ దంపతులు సోమవారం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు మొరపెట్టుకున్నారు. మా మేనమామ వద్ద కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి ఈపురుపాలెం రెవిన్యూ గ్రామ సర్వేనెంబర్ 186/4 నందలి య.01.00 వ్యవసాయ భూమిని 1997లో అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి పరిసరాల నుండి వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణం పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడ భూములు ధరలు మూడు రెట్లు పెరిగడంతో మాజీ కౌన్సిలర్లు శీలం శ్యామ్, పంచుమర్తి సాయిబాబ  మా మేనమామ చంద్రశేఖర్ వద్ద కొనుగోలు చేసిన వేరే భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని అడ్డుపెట్టుకున దౌర్జన్యంగా ఆక్రమించి దాడి చేసి గాయపరిచారని బాధితుడు మురళీ ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు.మా భూమి ఆక్రమించి అక్రమంగా షెడ్లు నిర్మాణం చేపట్టి భూమి చుట్టూ ఇనుప కంచలు ఏర్పాటు చేసి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నామని మమ్మల్ని మానసికంగా వేధింపులకు గురి చేసిన పరిస్థితులలో నా భర్త మురళీ ప్రసాద్ కు హార్ట్ స్ట్రోక్ రావడం వలన బైపాస్ సర్జరీ చేయవలసి వచ్చిందనీ కలెక్టర్, ఎస్పీల దగ్గర బాధితుడు ప్రసాద్ భార్య రాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల చెంతన చేరి ప్రజలను వేధించి కులం పేరుతో సామాన్యులను బెదిరించి అక్రమ కేసులు బనాయించి ప్రజల ఆస్తులను లూటీ చేసి వేధింపులకు గురిచేసే నేర చరిత్ర కలిగి రౌడీ షీటర్ అయిన శీలం శ్యామ్, పంచుమర్తి సాయిబాబాలు కిరాయి రౌడీ మూకలను వెంటబెట్టుకుని మమ్మల్ని చంపుతామని బెదిరిస్తూ వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న మా భూముల్ని అన్యాక్రాంతం చేసి నిత్యం మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుని మాకు ప్రాణరక్షణ కల్పించి, మాభూమిని మాకు ఇప్పించమని బాధిత దంపతులు జిల్లా కలెక్టర్, ఎస్పి ల యెదుట విలపించారు. బాధితుల గోడు విన్న కలెక్టర్ జిల్లా  జె. వెంకట మురళి  మిరియాలు ఫిర్యాదును తగు చర్యలు నిమిత్తం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేస్తూ, బాధితులను జిల్లా ఎస్పీని కలవమని సూచించారు. అనంతరం బాధితుల సమస్యల పరిశీలించిన జిల్లా ఎస్పీ  తుషార్. డూడి  చీరాల డి.ఎస్.పి  యం.డి  మొయిన్ తో మాట్లాడి బాధితులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయమని ఆదేశించినట్లు బాధితులు మీడియాకి తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular