రైతు రుణమాఫీ గురించి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. రైతు రుణమాఫీ తాము అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పలేదన్నారు.
రుణమాపీ చేస్తామని చెప్పామని.. తప్పనిసరిగ్గా చేసి చూపిస్తామన్నారు. ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత స్పష్టంగా విధానపరమైన నిర్ణయం ప్రకటిస్తామన్నారు. తాజాగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో విద్యుత్-త్రాగునీరు-ఆర్థికం అనే అంశంపై మాట్లాడారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారం దిగిపోయే నాటికి ఖజానాలో రూ.7వేల కోట్లు బ్యాలెన్స్ ఉందని బీఆర్ఎస్ చెబుతుందని.. కానీ వాస్తవాానికి మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాష్ట్ర ఖజానా రూ.3,960 కోట్లు మైనస్ లో ఉందన్నారు. రూ.7వేల కోట్లు ఎవ్వరి అకౌంట్ లోకి పోయాయని ప్రశ్నించారు.