కాంగ్రెస్సోళ్ల అబద్దాలు నమ్మి ఆగం కావద్దు
కార్నర్ మీటింగ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్తి పుట్ట మధూకర్
మంథని: సామాన్య కుటుంబంలో పుట్టిన తాను కళ్ల ముందే ఇంత స్థాయికి ఎదిగానని కాంగ్రెస్సోళ్లు కుట్రలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా గురువారం మంథని మున్సిపల్ పరిధిలోని ఎరుకలగూడెం, చైతన్యపురి కాలనీ,పద్మశాలివీధి,కూచిరాజ్‌పల్లి, గంగాపురి, లైన్‌గడ్డలలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల అబద్దాలు నమ్మి మోసపోయారని,మళ్లీ ఎన్నికలు వచ్చాయనినోట్ల సంచులతో వచ్చి తనపై అపవాదులు వేస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మి ఆగం కావద్దని ఆయన అన్నారు. తనను చిన్న తనం నుంచి చూస్తున్నారని, తాను ఎలాంటి వాడినో అందరికి తెలుసునన్నారు. చిన్న తనంలోనే తల్లిని కోల్పోయి మీ కళ్ల ముందే పెరిగానని, తల్లిని చూడకపోయినా తన తల్లి చేసిన సేవలను మీరంతా చెప్పితే ఆమె పేరున సేవలు అందిస్తున్నారని అన్నారు. ఆ సేవలకు ప్రతఫలం మీకే చెందుతుందని ఆయన అన్నారు. తల్లిదండ్రుల చేతిలో పెరగకపోయినా మీరంతా మా కుటుంబసభ్యులుగా బావించి ముందుకు అడుగులు వేస్తున్నానని ఆయన అన్నారు. అనేక ఏండ్ల కాంగ్రెస్ పరిపాలనల ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ల పాలన నుంచి విముక్తి కల్పించాలనే తపన పడుతున్నానే కానీ తాను ఎలాంటి తప్పులు చేయలేదన్నారు.
తాము వివిధ పదవుల్లో ఉన్నా కొన్ని కొన్ని పనులు కాకపోతే తమను తప్పు పట్టవద్దని ఆయన అన్నారు. అయితే తాను ప్రజలకు సేవలు చేస్తున్నానని, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ నాయకులు తనపై బురదజల్లె ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పటికే వంద అబద్దాల ఆరోపణలు చేశారని, ఏ ఒక్క ఆరోపణనను నిరూపించలేదన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్దాలను నమ్మి తనను దూరం చేసుకున్నారని, అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలను కట్టడి చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ప్రజల అవసరాలను గుర్తించి అభివృధ్ది చేశామని ఆయన గుర్తు చేశారు. మంథని చరిత్రలో ఒక బీసీ బిడ్డగా ఇంతస్థాయికి ఎదిగితే కాంగ్రెస్సోళ్లు రాజకీయ సమాధి చేయాలని చూస్తున్నారని, ఇప్పటి వరకు ఏ ఒక్క బీసీ బిడ్డను కూడా రాజకీయంగా ఎదుగనీయలేదన్నారు.
కాంగ్రెస్ కుట్రల నుంచి కాపాడుకుంటారో లేక ఖతం చేసుకుంటారో ఆలోచన చేయాలన్నారు. నాటి నుంచి నేటి వరకు నా ఆలోచనంతా భవిష్యత్ తరాల కోసమేనని, ఆనాడు ఎమ్మెల్యేగా ఈప్రాంత ప్రజలకు అనేక సేవలు అందించానని, మళ్లీ జెడ్పీ చైర్మన్‌గా తన బాధ్యతలు నిర్వర్తించానని ఆయన అన్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే భవిష్యత్ తరాల బాగు కోసమే పనిచేస్తానని, గతంలో పేదింటి ఆడబిడ్డల పెండ్లి బాధ్యత తీసుకున్నట్లుగానే మళ్లీ సామూహిక వివాహలు చేస్తానని, హైదరాబాద్‌లాంటి ప్రాంతాల్లోచదువు కునే పేద బిడ్డల ఉన్నత చదువుల కోసం గొప్పగా ఆలోచన చేసి పైసా ఖర్చు కాకుండా హైదరాబాద్‌లో రెండు వసతి గృహాలు ఏర్పాటు చేస్తానని, ఉన్నత చదువుకు తోడ్పాటు నందిస్తానని హమీ ఇచ్చారు. అంతేకాకుండా గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు మంజూరైతే ఆ ఇంటి నిర్మాణంలో తన సాయం ఉంటుందని, దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఇటు ప్రభుత్వ పథకాలతో పాటు తన సొంతంగా సేవలు అందించేలా ఆలోచన చేస్తున్నానని, తాను ఏ పదవిలో ఉన్నా పేద వర్గాల గురించే ఆలోచన చేశానని, పేద బిడ్డల ఆకలి తీర్చిన చరిత్ర తనదేనని అన్నారు. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీ అవసరాలను తీర్చే సేవకుడిగా పనిచేస్తానని, ఓట్ల కోసం ఐదేండ్లకోసారి కన్పించే నాయకుడిని తాను కాదని అన్నారు. మంథని మండలంలో ప్రచారం మొదలుపెట్టే ముందు మీ ఆశీర్వాదం తీసుకోవాలని ఈ మీటింగ్‌లు ఏర్పాటుచేయడం జరిగిందని, మీరంతా ఆశీర్వదించి ఆదరించాలని ఆయన కోరారు.