
They support Sudhir Reddy
: శ్రీ మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్
ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గెలుపు ఖాయం
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికే తమ మద్దతు ఉంటుందని శ్రీ మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డినగర్ డివిజన్ సాహెబ్ నగర్ లోని శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో శివ మాలధారణ చేసిన అనంతరం దేవాలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందాలని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ నాయకత్వంలో దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా, ఎల్బీనగర్ లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు గౌని నాగరాజు గౌడ్, ప్రవీణ్ నాయుడు, నరేందర్ గౌడ్, గిరి, నాని, నిఖిల్, జగన్, అంజి, శ్రీహర్ష, దేవాలయ అర్చకులు కుమార్, అధిక సంఖ్యలో శివస్వాములు పాల్గొన్నారు.



