గజ్వేల్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం లో భూములు కోల్పోతే కన్నబిడ్డల్లా చూసుకుంటూ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి తమ భూములు లాక్కున్నారని నిర్వాసితుడు కరుణాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లన్న సాగర్ భూనిర్వాసితుడు వేముల గట్టు గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి తమ ఆవేదన వ్యక్తం చేశారు నమ్మించి మోసం చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పే విధంగా గజ్వేల్ అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్నామని ఆయన తెలిపారు నష్టపరిహారం కింద తమకు భూమికి భూమి ఇల్లుకి ఇల్లు బడికి ,బడి ఇస్తామని చెప్పి నట్టేటముంచారని , గజ్వేల్ పట్టణంలో ఇచ్చిన ఓపెన్ ప్లాట్ లలో అధికారుల ఇఫ్తారీతిగా వ్యవహరించి అధికార పార్టీ నేతల అనుచరులకు వత్తాసు పలుకుతూ వాళ్లకి ప్లాట్లు నష్టపరిహారం ఇచ్చారని అర్హులైన వారికి ఇంకా నష్టపరిహారం చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇచ్చిన ఇండ్లు ఎప్పుడు కూలిపోతాయని ప్రాణాలు అరచేతులు పెట్టుకొని భయంతో బతుకుతున్నామని ఆయన అన్నారు నమ్మించి మోసం చేసిన కేసీఆర్ ఊడగొట్టడమే మల్లన్న సాగర్ భూనిర్వాసితుల లక్ష్యమని కరుణాకర్ రెడ్డి తెలిపారు


