కలలో దొంగలు కనిపించారు
నిజంగానే ఇంటికి కన్నం వేసారు
మేడ్చల్
Thieves appeared in a dream
They really did break into the houseజవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ విఎన్ఎస్ హోమ్స్ లో విచిత్రమైన చోరీ జరిగింది. ఇంటి యజమానురాలికి ఇంట్లో దొంగలు పడ్డాటు కల తీరా చూస్తే నిజంగానే దొంగలు పడ్డారు.
దొంగతనం అనేది తెలియకుండా జరిగే ఒక ప్రక్రియనే కాకపోతే చిత్రం ఏంటంటే దమ్మైగూడ మున్సిపాలిటీలో నివాసం ఉండే ఒక జంట తన భర్తకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయితే కొంతకాలంగా భార్య ఒకటే ఇంట్లో ఉంటున్నా నేపథ్యంలో తన భర్త దగ్గరికి వెళ్లాలని ఈ నెల 8 తారీఖున ఢిల్లీకి తన భర్త దగ్గరికి వెళ్ళింది అదేంటో చోద్యం కాకపోతే తను ఢిల్లీకి వెళ్లిన తర్వాత తన కలలో ఇంట్లో దొంగతనం జరిగిందని కల రావడంతో తను భయ బ్రాంతులకు లోనై కాలనీ ప్రెసిడెంట్ విలియమ్స్ ఫోన్ చేయగా తను ఇంటి దగ్గరికి వెళ్లి చూడగా దాన్ని చెప్పింది నిజమే అని నిజంగానే దొంగతనం జరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి మేడం అని చెప్పడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు ఇంటి యజమాని మరియు కాలనీవాసులు.
ఈ విషయాన్ని కాలనీ ప్రెసిడెంట్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన కాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటి యజమాని చెప్పిన వివరాల ప్రకారం ఇంట్లో నాలుగు తులాల బంగారం 30 తులాల వెండి 15 వేల నగదు ఉన్నట్లు ఆ వస్తువులు నగదు పోయినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.




