This is Sambasiva Pratap who has been appointed as Additional Advocate General :
అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా నియమితులైన ఇవన సాంబశివ ప్రతాప్
పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, తిల్లపూడి గ్రామానికి చెందిన సాంబశివ ప్రతాప్ గారు ఉమ్మడి హైకోర్టులోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనూ సీనియర్ న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. బీఎస్సీ బీఎల్, డి.పి.ఎం పూర్తి చేశారు. ఉన్నత న్యాయస్థానంలో 40 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంది. 1996 – 2002 మధ్య మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా ఆంధ్రా రీజన్ మున్సిపాలిటీలకు సేవలు అందించారు. 2016-2019 ఉమ్మడి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది(జి.పి)గా పని చేశారు. పలు ప్రముఖ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ గా విధులు నిర్వర్తించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి న్యాయపరమైన సేవలు అందిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ గా ఉన్నారు.